పుట:నీతి రత్నాకరము.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

62

నీతిరత్నాకరము

మయ్యెఁగదా యని పరితపించెను. నిన్ను నమ్మినవారికిఁ జేటు కలుగదనిన పెద్దలమాటలు పొల్లులే కదా భగవతీ యని దూఱెను. ఇఁక నీలోకమునకు నాకును దూరమగునని సిద్దాంతము చేసికొనియెను. భగవతినే ధ్యానించుచుఁ జేతులు ముకుళించి యూరకుండెను.

పాతాళుడు రాధికం గని కన్యకామణీ! యిది కాళికా దేవాలయము. కాని మీతండ్రియిల్లు గాదు. ఈ మాటలాడు వాఁడు పాతాళుఁడు. మీతల్లి యిందిరా దేవి నాకుఁదోఁబుట్టువు. కావున నీవు నాకు భార్య వగుదువు. ఈ రాత్రి మంచి ముహూ ర్తము. భగవతి నాయిలువేలుపు. ఆమె సన్నిధిని సాగు కార్యములు సఫలము లగును. వేఱుమాటలాడి లాభము లేదు. ఇఁక నీయాటలు సాగవు. నన్ను వరించి వివాహము సాగనిచ్చుటో లేక మఱియొక భావముఁ గనఁ బఱచితివేని యీ కరవాలమున కాహుతివగుటయో నిశ్చయించుకొమ్ము. ఈ పాతాళుఁడు సామాన్యుఁడు కాఁడు నిన్ను నిద్రించుచుండ మంత్ర బలమున నిటకుం దెచ్చినవాఁ డెవఁడు? ఈ పాతాళుఁడే. ఆలోచించుకొమ్ము. నన్నుఁ జేపట్టిననే నీవు బ్రదుకుదువు. లేకున్న నీకంఠర క్తమునఁ గాళికాదేవికిఁ దర్పణము చేయుదును. ఇంక నాలస్యము లేదు. ముహూర్తము సమీపించుచున్నది. పురోహితులు త్వర పెట్టు చున్నారు. ఏమూలికా ప్రభావమున నీవు స్మృతితప్పి యంతదనుక 'నుంటివో యామూలికయే యిది. బలవంతముగ నైనం బెండ్లి యాడుదును. కాని యది నాకిష్టము లేదు. వివాహమాడి యైహిక సుఖములనుభవించుటొండె. నీకంఠమును దునిమి 'దేవికి బలి