పుట:నీతి రత్నాకరము.pdf/62

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

61

ప్రతివాక్యము వేదవాక్కుగనే తలంచిరి. ఇంతలోఁ గుంతలుఁ డన్ని యు సిద్ధములయ్యెననఁ బోయి వ్యర్ధములయ్యెనని పలికెను. మహోత్సాహమున నున్న పాతాళున " కామాట వినఁబడ దయ్యెను. ఇదిగో రాధిక ను లేపెదనని యేమో మంత్రించి ముక్కురంధ్రముల నేది యో మూలికను వాసనచూపి మోమున నున్న తిలకమును దుడిచి వేదొకతిలకమును బెట్టి మూఁడు సారులు చిటికెలు వేసెను. నిద్ర నుండి మేలుకొనినట్లు రాధిక లేచి కూరుచుండెను.

ఇపుడు రాధిక యుండుచోటు కడుంగడుం గ్రొత్తది. భగవతి మాత్రము ముందుఁ గనఁబడును. ఆమెయు భీకర రూపమున నుండునదియే కాని రాధిక పూజించునంబ కాదు. రాధిక కూరుచుండి నలు దెసలఁ బరికించెను. పాతాళుఁ డగ పడెను. దేవాలయమునఁ దానున్నట్లు ఆఱుగురు తన్నేమో చేయ నున్న యట్లు తోచెను. ఇదేమి వింతయని యామె విచారింపసాగెను తుద కిది పాతాళునిమోసమని తెలిసికొనెను. పాతాళునిదుశ్చర్యల నామెయు వినియే యుండెను. ఇఁక నీలోకమునకుఁ దనకు ఋణము తీఱునని యామె తలుచెను. జననీజనకులం దలంచుకొని కన్నీరు కార్చెను. భగవతీ ! నిన్ను నమ్మినదాని నిట్లు చేయఁబూనితివి. ఇది నీకు న్యాయమా యని నిష్ఠురము లాడెను. తండ్రీ! నన్నే నమ్మియుంటివి. నీకు నావలని సాయము కల్గునన్న యాశ నశించెను. ఇంక నాదుఃఖమే నిన్నుఁ గుందించును. నన్నుఁ గన్న మీకిరువురకు నావలనఁ గలిగెడిలాభ మిదియే యని తలంచెదను. ఇక నేఁ జేయఁదగిన పనియేమని, యూహించెను. ధర్మ మాపదలనుండి రక్షించునన్న నుడి వ్యర్థ.