పుట:నీతి రత్నాకరము.pdf/61

ఈ పుట ఆమోదించబడ్డది

60

నీతిరత్నాకరము

 చేయి వేసినట్లే యుండెను. కుంతలుఁ డభ్యంగస్నానము చేయింపవలదా యని ప్రశ్నింప దొంగపెండ్లికి మంత్ర స్నానమే చాలునని యర్చకమహాశయులు బదులిడిరి. కుంతలు డంగీకరించెను. భవాని కెదుట శిబికఁ జేర్చిరి. "దేవికడనున్న పీఁటలం దెచ్చి యచ్చో నర్చకు లమరించిరి. అగ్ని హోత్రుని సిద్ధము చేయుచుండిరి. కుంతలుఁ డింకఁ బెండ్లి సాగింతును. రాధికను మేలుకొలుపుమని పాతాళునకుం దెల్పెను. నీవన్నియు సిద్ధము చేసికొని యగ్ని నిటనుంచిన యుత్తరక్షణమున మేలుకొనునట్లు చేసేదనని పాతాళుఁ డనేను. అర్చకులు పాతాళా ! వివాహ మగును. తర్వాత నెందుఁ బోవయత్న మని యడిగిరి. వివాహానంతర మీయూర నుండ వలనుపడదు గాన నీ చెంతనున్న కొండ దరిఁ కొలఁదిదినము లుందును. అందొక పల్లియ గలదు. అందు శబరులు పెక్కండ్రు, 'నా శిష్యులు గలరు. వారి చెంతనున్న నన్నుఁ దేరిచూడ నిర్జరులకే శక్యంబు గాదు. ఎట్లో పదాఱుదినములు గడ పెదను. ఆనల నీ యూరికి వచ్చి దంపతులము దేవీపరిసరమున నుండుము. ఇంతలో నీ రాధిక నాకు లోఁబడును. ఆవల వివాహమును ద్రోసివేయఁ దరముగాదు. పుత్త్రికాప్రేమమున నన్నేమియు ననఁజాలక యల్లునిగ మామ గారవించును, అప్పుడే నాదెబ్బ, మిమ్మెల్ల గారవింతునని యింక నేమో మాటలాడుచుండెను వారు నీదంతయు యథార్థముగా సాగుననియే తలంచిరి. ఎంతటి మంత్ర వేత్త గాక యున్న నిట్లు 'రాధికను సృతి లేక యుండఁ జేసి యెవ్వరికిం దెలియ రాకయుండ బహిరంగముగా శిబిక 'నెక్కించి తేగలఁడా యని వా రూహించి యాతని