పుట:నీతి రత్నాకరము.pdf/60

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

59

దేవాలయముకడకుఁ జేరఁగల్లెను. నాలుగుగడియల రాత్రికి ముందే యర్చకులు పూజచేసి యిండ్లకుం బోయి శయనించి నట్లుండి రెండవజామున నిర్వురు వచ్చి యాలయముకడ వేచి యుండిరి. ఆలయము చుట్టుపట్టుల నత్యున్నతవృక్షములు గలవు. కాన గాఢాంధ కారముగనే వెన్నెలరాత్రులయందు నుండును. ఇక నానాఁడు చెప్పవలసిన దేమి ? దైవవశమున నాకసమున మబ్బు క్రమ్మియు నుండెను. అర్చకులు తొలుత గుంతలుంగాంచి వార్తల నేఱింగి సంతోషమున వారి రాకకై వేచియుండిరి. శిబిక యాలయమునకు నించుక దవ్వున నునిచి పాతాళుడు నిర్వురు వ్యాధులు నరు దెంచిరి. అర్చకులం గలిసి కొనిరి. ఆ వ్యాధులయం దొక్కనికా తొలిదిన మాశౌచము వచ్చెను. వానికిం దక్కినవారిలోఁ బెక్కండ్రు జ్ఞాతులు. ఇర్వురు మాత్రము బంధువులు. ఆశౌచముగలవా రాయాలయము లోనికిం బోయిన మరణము సంభవించునని ప్రవాదము కలదు. ఆయనుమాన మావ్యాధులకు మెండు. కావున వారు లోపలికి రాఁజాలమనిరి. కుంతలుఁడు, అర్చకులిరువురు వ్యాధు లిర్వురు పాతాళుఁడును గలిసి యాఱుగు రాశిబికఁగొని దేవా లయములోఁ బ్రవేశించిరి.

చంద్రోదయ మయ్యెను. కాని తన్నిర్మల కాంతులు సర్వత్ర వ్యాపింపనీయక మేఘము లావరించి యుండెను. వృక్షచ్చాయలు మఱింతగ నంధకారమును బెంపొందించెను. వ్యాధు లేడుగురు వెలుపల నుండిరి. పెండ్లి కొడుకు పురోహితుఁడు గాక నలువురు లోన నుండిరి. రాధిక విస్తృతిమై నుండెను. ముఖ కాంతి యొక్కంత వాడియుండెను, వేసిన