పుట:నీతి రత్నాకరము.pdf/6

ఈ పుట ఆమోదించబడ్డది

7

మొదటి వీచిక

ఏఁబదియాఱు దేశములుగా నీ భరతఖండము విభజింపబడి యుండెడిది. ఏబదియాఱు భాషలుండెనని కొంద ఱందురు. అన్ని యుండవనియు సంస్కృతము ప్రాకృతాది షడ్బాషలు, వీనివికారములుగా భాష లుండెనని కొంద ఱందురు.ఇప్పటి భాషలంబట్టి యా కాలపుభాషల నిర్ణయించు టంత మంచిదిగాదు. ఆ దేశములయందు మహారాష్ట్ర దేశము మిగులఁ బ్రఖ్యాతిని మించియుండెను. మహారాష్ట్ర దేశీయులు మిగుల బలాఢ్యులు. సదాచార పరాయణులు. ప్రతిక్షణ విలక్షణపరిణామములగు నాచారములసలయించు నూహలు గలవారు కారు. పూర్వులయందు గౌరవము, దేశమందు విశ్వాసము, శాస్త్రములయందుఁ బ్రీతి , భగవంతునియందు భక్తి యను నివి వారికిఁ దోడఁబుట్టినగుణములు. స్వదేశాభిమానము మెండు బలప రాక్రమములయం దాఱితేరిన వారలయ్యు నొరుల హింసించునలవాటుగలవారు కారు. ఊరకూరక తమ్మలయించినపుడు మాత్రము ప్రతిఘటింతురు. ప్రతిఘటించిరిపో కార్యము పండుటయో మేనులఁ దొలఁగుట యో కావలసినదే కాని నడుమ వదలుకొను నాచార మాదేశీయు లకు లేదు. వారికి జీడిమచ్చలని పేరుగల్గుటకుఁ గారణమిదియే యయి యుండనోపు. సామాన్యముగా నెల్లరు భవానిని బూజించువా రనవచ్చును. ఆమెకరుణ లేక వృద్దికాఁజాలమను విశ్వాసము వారలకు సుగ్గులోఁ బెట్టినట్టిది. కావుననే శ్రద్ధా భక్తుల భవాని నారాధింతురు బలుల నర్పింతురు. గవ్వలతో నాదేవిని బూజించువారు కొందఱు గలరు. నిర్మలమగు వస్తువుల నర్చించిన నిర్మలముగా బుద్ధియుండునని వారియూహ కాఁబోలు. -