పుట:నీతి రత్నాకరము.pdf/59

ఈ పుట ఆమోదించబడ్డది

58

నీతిరత్నాకరము

కట్టు లొనరించెను. అంతకుముందే గాఢనిద్రలో నున్న రాధికకు నీ రెండు మందులు తోడ్పడి మఱింత గాఢనిద్రఁ బట్టఁ జేసెను. అంత నాతఁ డామెను బొరలించెను. శవముచందమున నామె యుండెను. తనశక్తి పనిచేసెఁగదా యని యానందించెను. తలుపు తీసెను, దేవికి నమస్కరించెను. బలశాలిగాన నవలీల రాధిక నెత్తుకొని యాపూలతోటనుండి పడమరకుం బోయేను. ఒకయీల వేసెను. వెంటనే కుంతలుని గూడి శిబిక ఁ గొనివచ్చిన తొమండ్రు నవ్వల నున్నందున నందు నలువురు మఱ్ఱి కొమ్మనుండి యీవలికి దిగిరి, నలుగురు పై నుండిరి. ఒక తొట్ల దింపఁబడియె. అందారాధికను బరుండఁ బెట్టి పై వారికి సంజ్ఞ చేయ వా రాతొట్ల నీడ్చుకొనిరి. మెల్ల మెల్ల గాఁ గొమ్మవెంటఁ బదిలముగాఁ గొనిపోయి నలువురు దిగఁగా మరల నా తొట్లను దిగవిడిచిరి. క్రిందనున్న వా రందుకొనిరి. శిబికలోఁ బరుండఁ బెట్టిరి. కుంతలున కొక్క సేవకుని తోడిచ్చి ముందు పంపి యెనమండ్రు, వ్యాధులు తాను బయనము సాగించిరి. నిశ్శబ్దముగా వారు నడచిరి. ఆనాఁ డానగరమున వింత నాటకమొకటి యాడఁబడుచుండెను. పెక్కం డందులకుఁ బోయి యుండిరి. సందుగొందులంబడి యెట్లో నగరమును దాఁటిరి. ఆనగరమునుండి ధనవంతులు శిబికల నధిరోహించి ప్రయా ణముసాగించు టాచారమైనందున నిదేవ్వరిదో యని యెవరైనం జూచినను బ్రశ్నించుటగాని యనుమానపడి నిలుపుటగాని చేయరైరి

విలాసథామమును దాఁటి పల్లకి యవ్వల బయనము సాగించెను. చంద్రోదయమునకు నించుకముందే యాశిబిక