పుట:నీతి రత్నాకరము.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

57

కొన్ని వస్తువులు గలసంచి నొకదానిం దీసికొని వెడలి పోయెను.

పాతాళున కాయింట నొకదాసిక రహస్యములు తెలుపుచుండునది కలదు. అది యొక్కతుకయే యాయింటికిం గలమర్యాద నడంచునది. అది నీచమతి. పాతాళునియింటికిం జెంత నాదాసికగృహము గలదు. మంచిమాటలాడుచు దానినేట్లో వశపఱచుకొనియెను. రాధిక శయనింపఁగనే యాజాడ నాదాసీ యెట్లో పాతాళున కెఱిఁగించెను. అది వారియింటఁ బరుండునది కాదు. తనపనులన్నియు ముగించి యది వెడలిపోయెను. జామురాత్రి, కాఁగానే పాతాళుఁ డామఱ్ఱివృక్షము నెక్కి తోటలో దిగియెను. దాసి యేఱిం గించిన ప్రకారమే తలుపు చక్కఁగా వేయఁబడక యుండెను. కాన దానిం దీసికొనివచ్చెను. దీపములు వెలుఁగుచుండెను. అతఁ డాదీపములం దొకపసరు పిండెను. వాని కాంతి ప్రసరించిన చోటుల శయనించియున్న వారెల్లఁ జూచుచున్నను మాట లాడఁ జాలరు. ఆపసరునం దట్టిశక్తి కలదఁట. ఆవెంట నిందిరాదేవి శయనించియున్న గదిని దాఁటి దానిముందు శయ నించియున్న పరిచారికలం గాంచుచు దేవియుండు గదిలో నికిం బోయెను. రాధిక మెత్తనిచర్మముపై శయనించియుండెను. దేవికి నమస్కరించి యారాధిక నుదుట నొక్క తిలకము పెట్టెను. దాన నామెకు సృతితప్పునని యాతఁ డెఱుంగును. నాసికారంధ్రముల నొక్క మూలిక వాసనఁ జూపెను. దానిచే నామెకు వాగ్బంధ మగును. ఈ రెండింటిలో నొక్కటియే యాతనిపనికిఁ జాలినను మఱింత దిట్టముగాఁ బనిచేయుకొఱ