పుట:నీతి రత్నాకరము.pdf/57

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

56

మెంతయో లేదు. ఆపూలతావు లాగదిలో వ్యాపింపవలయు ననియే మొదటనచ్చట నది గట్టఁబడియె. ఆగదికిఁ దూర్పుభాగ మున మఱియొక గది కలదు. అదియే భోజనశాల యనంబడు. దేవికి నైవేద్యము పెట్టి భుజించుట వారియింటఁ గలవాడుక. ఆభోజనశాలకు నానుకొని యుత్తరభాగమున వంటచేయు భాగము. దేవీగృహమునకు దక్షిణ భాగముననే యిందిరా దేవి శయనించియున్న గది కలదు. భగవతియుండు గదికి నుత్తరభాగమునఁ బాకగృహమునకుఁ బడమరగను గది యొకటి కలదు. అందుఁ బారాయణపుస్తకములు పూజాద్రవ్యము లుండును. అందే శ్రీనివాసదాసు దేవీగ్రంథములం జదువుకొనఁ గూరుచుం డును. ఆనాఁడు శుక్రవారము గావునను దండ్రి,జాలంధరీదేవీ పూజాతత్పరుఁడై యుండుననియు రాధిక దేవీసన్నిథానముననే పరుండెను.

పాతాళుఁడు తనవూన్కి నెఱవేర్పఁబూని పెందలకడ భుజించి కుంతలు నింటికింబోయి సంకేతస్థలమునకు రమ్మని హెచ్చరించెను. ఆసంజవేళనే యిరువురు మనుష్యులు సురాభాండముల నెత్తుకొని తనయింటి వెనుక ప్రక్కన నిలుచుండి పిలిచిరనియుఁ దలుపుదీసి సందులోనుండుఁడని చెప్పితిననియు మఱి కొలఁదిక్షణములకే తొమ్మండ్రు, వ్యాధులు వచ్చిరనియు, వారా సురను దృప్తిగాఁ గ్రోలిరనియు వారన్నము తిని వచ్చితిమని చెప్పి రనియుఁ దాంబూలము మాత్ర మిచ్చితిననియు వారందే యున్న వారనియు నింకను జాము రాత్రి, కాలేదనియుఁ గాఁగానే పిలుచుకొని వత్తుననియుఁ గుంతలుఁడు దెలిపెను. ఏవో కొన్ని మాటలు రహస్యముగాఁ దెలిపి పాతాళుఁడు