పుట:నీతి రత్నాకరము.pdf/56

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

55

నారాధింతురు. నేను నిందుండియే యాదేవి నారాధింపఁ దలంచితిని. భక్తపరాధీనమానసగదా లోకజనని. ఈ వారమునఁ గల విశేష, మద్దియే అనఁగా నామెయు నామాటలు మదికి సరిపడి యుండుటంబట్టి మంచిదమ్మా యని కూఁతుచర్యలకు మహానంద మున మునుంగుచు లోలోన నీకన్యక భగవత్యంశ సంభూతు రాలే యని నిశ్చయించుకొనియెను. ఆనాఁడు దైవవశమునఁ గాఁబోలు రాధిక యుదయాదిగా సాయంకాలముదనుక క్షణమైన నూరకుండక యేదోయొక కార్యపరత దేహమును శ్రమపెట్టెను. సాయంకాలము కాఁగాఁ దనపనులన్నియుఁ దీర్చుకొని భగవతి విగ్రహమున కెదుటనే భూమిఁ బరుండెను. చెలికత్తెలు దా సికలు నించుకదూరముగా శయనించిరి. ఆగదితలుపు తెఱచియే యుంచిరి. కాన రాధిక వారికిఁ గనఁబడుచునే యుండెను. దీపము వెలుఁగుచునే యుండెను. ఆ పక్క గదిలో నిందిరా దేవి శయనించెను. నాడు పెందలకడ శయనించిరి. కారణము పగటి వేళ విశేషించి రాధిక పాటుపడుటయే కాని "వేఱోండు కాదు. శయనించిన వెంటనే యందఱకు గాఢనిద్ర పట్టెను.

ఆగృహ మత్యున్నతము. విశాలభాగము నాక్రమించి నదియు నగు. దానికిం బశ్చిమభాగమునఁ బూలతోఁట గలదు. అది యింటినంటియే యుండును. దాని ప్రక్కన నెత్తైన ప్రాకారము గలదు. ఆ ప్రాకారమునకుఁ జెంత మఱ్ఱి చెట్టు గలదు. దానికొమ్మలు కొన్ని యాపూలతోటలోనికి సాగినవి కలవు. ఊడలు దిగ నది యొక మొదలుగాఁ దోఁచునట్లు నాలుగైదు కొమ్మలుండెను. ఆతోఁటకు నంబానిగ్రహము గలగదికి దూర