పుట:నీతి రత్నాకరము.pdf/54

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

53

యనుభవమును బట్టి స్పష్టముగా గోచరించును. మీరు త్వరగా నగరమున కరిగి నాయీ వాక్కులను స్మరించుచు నిశ్చింతముగా ధైర్యము విడనాడక ప్రయత్నము సాగింపుఁడు.

అని రామదాసుపలుకఁగా శ్రీనివాసదాసు వినివిని యంత "రార్థమును జక్కంగా గ్రహింపఁజాలక యేవో కొన్ని విఘ్నములు గలిగినను వివాహము నెఱవేఱునన్న సారమును మాత్రము గ్రహించి యా రేయి సుఖనిద్ర చేసి మఱుదినము దాసుగారియనుమతిచే నందే గడపి సాయంకాలమున నగరము నకుఁ బయనము సాగించెను. శ్రీవత్సాంకదాసు వివాహవిషయమై మాటలాడి ముహూర్తము నిశ్చయించి దాసుగా రెపుడు చెప్పుదురో యావార్త మీకుం దెలుపుదుననియు సర్వ ప్రయత్నములు చేయవలయుననియుఁ జెప్పి సాగనంపెను. ఇరువురు విడిపోవలసివచ్చెను గదా యనుచింతఁ బూనఁదగిన వారైరి ఎంతో కష్టమునఁ బరస్పరము విడిపోయిరి. ఔరా! స్నేహమెంత బలవత్తరము ! ఆవఱకు వా రిరువు రొక్కసారి యేని చూడని వారైన నొక్కదినము కలిసియుండినందున నిర్మల చిత్తులు గాన మరల విడిపోవవలసివచ్చేనే యనువిచారము నొందవలసినవా రైరి. స్నేహమువంటి పదార్థ మీలోకమున నేదియు లేదని పెద్దలు పలుకుమాట నిశ్చయ మని యీకథ సిద్దాంతము చేయుచున్నది.

పాతాళుఁడు విలాసథామసగరమున నేమి చేసెనో యించుక విచారింతము. సప్తమీశుక్రవారము వచ్చెను. కృష్ణపక్షము గాన రాత్రి పదునాల్గుగడియల కించుమించుగాఁ జంద్రోదయ మగును. నాఁటియుదయమే తన ప్రయత్న మం