పుట:నీతి రత్నాకరము.pdf/53

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

52

మహానందమున యోగీశ్వరులయాజ్ఞ యమోఘము కావును సమ్మతించితి మనిరి. తన సంపూర్ణ ప్రీతిని శ్రీనివాసదాసును వెలి పుచ్చెను. పెద్దల “తథాస్తు" అను శబ్దములు సాంద్రము లయ్యెను. సుముహూర్తము నిశ్చయింప రామదాసుగారే సమర్ధులని యందలివా రనిరి. ఆమీఁద నీవివాహమున కెన్నియో కారణములు గలవు సుముహూర్తము దైవికముగా నిర్ణయింపఁబడును. ఎవ్వరి ప్రయత్నమున వా రుండవలయునని రామదాసు పలికెను. యోగ దృష్టిగల దాసుమాటల కెల్లరు నాశ్చర్యంపడి యట్లే కావలయు ననిరి. ఆదినము శ్రీనివాసదాసు రామదాసుగారింగూడి శ్రీవత్సాంక దాసగృహమున నుండెను. రాత్రి భోజనానంతరము రామదాసు శ్రీనివాసదాసు నే కాంతమునఁ జీరి యిట్లు పలికెను.

వత్సా! రాధిక సామాన్యకన్యకగా భావింపఁదగదు, పరమేశ్వరి తేజస్సాకన్యకయందుఁ గలదు. శ్రీ కృష్ణ దాసు కూడ భగవదంశము గలవాఁడు. వీరిరువురవివాహమున మీ రెండువంశములు జగద్విఖ్యాతిం గాంచఁగలవు. కాని కొన్ని యంతరాయములు పొడసూపును. దేవాంశ సంభూతుల విషయముననే యవి పెలుచన సాగుచుండును. రాక్షసాంశ సంభూతులు పెక్కడ్రుందురు. వారు దేవతాంశము గల వారలం గాంచి యోర్వఁజాలరు. వారు చేయుదుండగములు తొలుదొలుత ఫలించినట్లు గానిపించి తుదకు నిష్ఫలము లగును. ఈవిషయమున నింతకంటెఁ జెప్పఁదగదు. ఈ వాక్యములు సూత్రప్రాయములుగా భావించి కార్యనిర్వహణము నకుం బూనవలయును. ఈవాక్కులయర్దమెల్ల ముందు మీకే