పుట:నీతి రత్నాకరము.pdf/52

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

51

వారిదర్శనము నేయాశించుచున్నాఁడనని శ్రీనివాసదా సనియెను. మనయింటి కడనే వారిపుడు వేంచేసియున్న వారనియుఁ దప్పక మన యింటికి మీరు రావలయుననియు శ్రీవత్సాంకదాసు ప్రార్థించెను. మీరింతగా ప్రార్థింపవలయునా తప్పక వచ్చెదనని శ్రీనివాసదాసు బదులు చెప్పెను. "శుభమస్తు” అని పెద్ద లని. అప్పుడే తరలి యందఱు శ్రీవత్సాంకదాసుగారింటికిం బోయిరి.

వీరి రాక నెఱింగి యందులకే రామదాసు వేచియుండెను. గృహముసు బ్రవేశించునపుడు శుభశకునము లెన్ని యో కనఁబడెను. వియ్యంకు లిరువురును సంతసించుచుండిరి. అంగణమునం దే దాసుగారు కూరుచుండియుండిరి. కాన వారిని జూడఁగ నే శ్రీనివాసదా సుత్తరీయమును నడుమున బిగించి నమస్కరించెను. యోగి యాశీర్వదించి యందఱఁ గూరుచుండ నియోగించెను కుశల ప్రశ్న మొనరించి రాధిక యారోగ్యమును బలుమాఱు లడిగెను. పెద్దలందఱు దేవీసన్నిధిని సాగిన వార్తను దెల్పిరి. రామదాసు నవ్వుచు నీదాంపత్యము సృష్టి కర్తను బరీక్షింప నున్నది. ఈ యిరువురకే దాంపత్యము కుదురనిచో సృష్టికర్త యసమర్థుఁడే యగును అనెను. వృద్ధులందఱు కరతాళధ్వను లొనరించి తమసమ్మతమును దెల్పిరి. ఈ విషయము రామదాసుగారి యిష్టానుసారము జరగకమానదని శ్రీనివాసదాసనెను. నాకుఁ బరమసంతోషముగా నున్నది. తప్పక యీవివాహము సాగవలయును. వారి నాశీర్వదించినేనెచ్చటికో పోయెదను. అందులకే యిపుడు నిలిచితినని రామదా సనియె. శ్రీవత్సాంకదాసును సాధ్వియగు పద్మావతియు