పుట:నీతి రత్నాకరము.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

50

నీతిరత్నాకరము

బట్టి యందే కూరుచుండి దేవీ మాహాత్యమును స్మరించు చుండెను.

శ్రీవత్సాంకదాసు భార్యాపుత్త్రు లు వెంట రాఁగా జాలంధరీదేవీ దర్శనార్థ మరిగెను. ఆదేవాలయమున నీదాసుగారికిఁ గొన్ని మర్యాదలు గలవు. గోపురము చేరఁగనే దేవి పూజ గావించిన పూలహారమును దెచ్చి యర్చకులు మెడలో వైచి పిలుచుకొని పోవునాచారముండెను. ఆవాడుక ప్రకారమర్చకులువచ్చి గారవించి పిలుచుకొని పోయిరి. ప్రదక్షిణత్రయ మొనరించి లోపలఁ బ్రవేశించి పరదేవిని దర్శించి యర్చకులచేఁ బూజ గావింపఁ జేసి పాద ప్రసూనములఁ గైకొని మరలివచ్చుచు శ్రీనివాసదాసు నెవ్వరో తెలుపఁగాఁ జిర కాలసందర్శనజనిత సౌహార్దమునఁ బరస్పరాలింగ నాది దేశాచారముల నడపి యందే యిరువురును గూరుచుండిరి. కుశలవార్తలఁ బ్రశ్నించిన 'వెనుకఁ దన కుమారుఁ డీతఁడని శ్రీవత్సాంకదాసు తెలిపెను. శ్రీనివాస దాసు ప్రమోదసంభరితమానసుఁడై యే వేవో విషయములఁ బ్రశ్నించి వివాహవిషయమును గూడఁ బ్రశ్నించెను. తనపుత్రునకుఁ దగినకన్యక దొరకినఁ ద్వరగా వివాహము చేయనున్నాఁడ నని కృష్ణదాసుతండ్రి, తెలిపెను. వారి చెంతనున్న పెద్దలు కొందఱు రాధికాగుణగణములను విద్యావైశద్యమును బేర్కొని యామే శ్రీకృష్ణ దాసునకుఁ దగినకన్యక యనియు నామెకు నీవరుఁడు తగినవాఁడనియుఁ దెలిపిరి. పెద్దలయాశయము ఫలింపకపోవునా యని శ్రీనివాసదా సనియెను. మాయాశయ మీ కన్యావరులకు దాంపత్యము శుభదాయక మని యా పెద్దలు 'తెల్పిరి. అందొక రీవిషయము రామదాసుగారి నడిగిన మేలనిరి.