పుట:నీతి రత్నాకరము.pdf/50

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

49

ప్రధానముగా గలయర్చకుల కపట భక్త్యభినయమును దూషించెను. ఇట్టులాచోటునఁగల దురాచారముల కేవ గించుచుం బోయి జగన్మాతను జాలంధరీనామధారిణిని దర్శించెను.

ఆ దేవి భయంక రాకృతిం గానంబడును. కాని భక్తులకు మనోహరరూపిణిగనే కనఁబడును. ఒక్క కరమునఁ బాశాయుధము కలదు. దేవిని సేవించు వారికి యమపాశ భయము లేదను నర్థము నాచిహ్నమే తెలుపును. మఱి యొక్క హస్తమున నంకుశము కలదు. ఆయది దుర్మార్గముల విశృంఖల వృత్తిం జరించువారి నడంచునను భావమును వెల్లడించును. ఇంకొక బాహువునందుఁ బుష్పబాణము వెలయును. అయ్యది పరదేవి నాశ్రయించువారలకుఁ గష్టములు సులభముగాఁ గడచిపోవునను నభి ప్రాయమును దేటపఱచును. మఱియు నొక్క కేలఁ బుండ్రేక్షుచాపము దృగ్గోచరం బగును. అది భగవతి నెల్ల కాలము భజించువారలకుఁ గష్టములే కలుగక మనోహరముగాఁ గాలముసాగునను నుదంతమును దెల్లముగఁ జేయును. ఇట్టులున్న యా దేవీ విగ్రహమును జక్కఁగా దర్శించి పరమానందమునఁ జేతులుమోడ్చి నమస్కరించి నిలువంబడి సహస్ర నామములఁ బారాయణము చేసి ధ్యానించెను. అర్చకులు నామహాత్ముని గాంచినంతనే మనోవృత్తులు మార్పు నొంద భక్తిమై నర్చించి పాదోదకము నొసంగి ప్రసాదమిచ్చి తమకృత్యమును నెఱవేర్చిరి. దాసు వారి కుచితధన మొసంగి ప్రసాదమును శిరసావహించి యించుక కూరుచుండునాచార ముండుటం