పుట:నీతి రత్నాకరము.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

48

నటించుచు నితరులు వచ్చి యాడఁబూనిన మోసపుచ్చుచు ద్రవ్యము నాకర్షించుచుండిరి. ఇంకను గొన్ని తావుల నాడుచుఁ పాడుచు స్త్రీలంగూడి వినోదములు సలుపుచు యాచించు చుండిరి. మఱియు నొక్క తావునఁ జచ్చిన పాముతోలును బ్రతికింపఁ జేసి దాని నాడించుచుఁ దమశక్తి కందఱు విస్మయంపడ నాలుగుడబ్బులిండని బతిమాలుచుండిరి. వీరినెల్లరఁ జూచుచు వచ్చినవారిలో మూఁడువంతులు జనులు కాలమును బుచ్చుచుండిరి

భర్తచనిపోయిన యాఁడువాండ్రు, రాచిప్పలమ్ము నంగళ్ల కడ నిలుసఁబడి బేర మాడుచుండిరి. ముత్తైదువులు కుంకుమము, అద్దములు, చెవ్వాకులు నమ్ము'నంగళ్ల దగ్గఱ మూఁగి యుండిరి. ఇట్లు వచ్చినవారు దేవాలయము లోనికింబోవఁ. జోటీయక తమ రెందులకు వచ్చినదియైన నాలోచించక పొద్దు పుచ్చుచుండిరి. శ్రీనివాసదాసు కష్టముమీఁద వీరినందఱిని దాఁటి దేవాలయమును బ్రవేశించెను. లోపల జన బాహు ళ్యము లేక హాయిగా నుండెను. గోపురమువఱకు మనుష్యా రణ్యము గలదు కాని లోపల నేకష్టము లేక భగవతిని దర్శింప ననువుగా నుండెను. పామరుల కాల క్షేపమునకు దాసు వెఱగందెను. యాత్రావ్యాజమున నెందఱు క్షుద్ర కార్యము లొనరించుచున్న వారని చింతించెను. అభ్యంతరమును బ్రవేశించి యందు నిలుచుండి వచ్చుచున్న నవయువతులం జూచుచు భగవతిని సేవించుచున్న జాడ నభినయించు దుష్టమతులం గాంచి గర్హించెను. యాత్రలకై వనితలం బంప రాదన్న నీతి యెంతయు సమంచితమని నిశ్చయించెను. ద్రవ్యార్జనమే