పుట:నీతి రత్నాకరము.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

47

ముగ శ్రీనివాసదాసుతో మాటలాడుము. అని నచ్చఁజెప్ప శ్రీవత్సాంకదాసు తద్వాక్యమును శిరసావహించి యట్లే చేయ నిశ్చయించెను.

సాయంకాలమున శ్రీనివాసదా సుచితపరివారముం గూడి జాలంధరీదేవతాదర్శనార్థము పోయెను. జనులు క్రిక్కి ఱిసియుండిరి. మార్గమున నిసుక చల్లి నను రాలకుండెను. త్రోవ కిరు ప్రక్కల యాచకు లుండిరి. గోవిందా యనువారు కొందఱు, కన్నులు లేనివాఁడ ననువారు కొందఱు, కుంటివాఁడను బాబూయనువారు మఱికొందఱు నిట్లు పెక్కుచందముల యాచించుచుండిరి. కొందఱు చెట్ల కింద నిలుచుండి సుద్దులు చెప్పుచుండిరి, మణికొందఱు దేవిని బాడుచు భక్తిరసమున మునిఁగినట్లు నటించుచుండిరి. ఇంకను గొందఱు కాశి రామేశ్వరము లోనగు క్షేత్రముల నద్దములలోఁ జూపుచుండిరి. ఒక్క తావున నొక రాటము తిరుగుచుండఁగా దానికొనల యందు వ్రేలాడఁగట్టిన కఱ్ఱగుఱ్ఱములపైఁ గూరు చుండి యొకఁ డాచక్రమును ద్రిప్పఁగా గిరగిరఁ దిరుగుచుఁ బాటలు పాడుచుఁ దమరు రౌతులమనుచు నాగుఱ్ఱములఁ దోలుచున్న మార్గము నటించుచు నార్చుచుండిరి. మఱియొక్క తావునఁ జాలుగాఁ బరుండి కొందఱు పాషాణములఁ బయిని వైచు కొని ముక్కులు గనఁబడునట్లుండఁగా వారి ప్రక్కన నొక్క రొక్కరు కూరుచుండి మహానుభావుని నీతనిం జూచిపొండు. ధర్మ మేమైనఁ జేయుఁడని బతిమాలుచుండిరి. మఱికొన్ని తావుల జూదరులు కూరుచుండి తమలో దామే యుద్దులుగా నాడుచుఁ దగువులాడుచు ద్రవ్యమును సంపాదించినట్లు