పుట:నీతి రత్నాకరము.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

46

నీతిరత్నాకరము

దెంతురు. శ్రీవత్సాంకదాసు ప్రతివత్సర మా దేవ్యుత్సవ సమయమున నతిథులకు దీనాంధక బధిర కుబ్జులకు నన్నదానము చేయువాడు. ఆవత్సరము దైవవశమున మరల రామదాసు వచ్చెను. పరమానందమున నేదియో గొప్పశుభము కలుగఁ గలదన్న విశ్వాసమున నారామదాసును బూజించుచు వచ్చిన వారికి మృష్టాన్న మిడుచు మహాదాత యను ఖ్యాతికిఁ దగియుండెను. పద్మావతి భర్తతో దాసుగారు వచ్చియున్నారు కదా. కుమారునకు వివాహమెచ్చటఁ జేయుమనునో యడిగి తెలిసికొని పిదప నా ప్రయత్నము చేయఁగూడదా యని గట్టిగాఁ బ్రశ్నింపసాగెను. ఆ ప్రశ్నము యుక్తియుక్తముగా నున్నందున ధర్మపత్ని తో నీ చెప్పినట్లే చేయుదునని యొకనాఁ డే కాంతమున రామదాసుకడం జేరి మెల్లగాఁ బ్రశ్నించెను. దాసు నవ్వి వత్సా! దైవప్రయత్న మనుకూలించుచున్నది. ఆ ప్రయత్నముగా నావివాహము సాగును నీ వూరకుండుము. నేనందులకే వచ్చినాఁడను. తగినకన్యక దొరకును. ఈ యుత్సవ మునకు విలాసధామమునుండి శ్రీనివాసదాసు వచ్చియు న్నాడు. ఆతని నేదోయొక నెపమునం గాంచి మాటలాడుము. ఆతని కొక్కతుక యే పుత్రిక కలదు. ఆమె పేరు రాధిక. సుగుణవతి, విద్యావతి, రూపవతియు నగు నాకన్యక నీకొమరునకుం దగినది. ఆదాంపత్యము వర్ణ నాతీతమై సృష్టికర్తను వేనోళ్లఁ గొనియాడందగినదై యుండును. ఆతఁడును నా రాకకై వేచియున్న వాడు. ఒక్క కార్యము నామదికిం దోఁచి నందున నిచ్చటికి వచ్చితిని. దాని నిపుడు తెలుపనయితి కాదు. కార్యాంతమున నెఱుకపడఁ దగియుండును. సమయోచిత