పుట:నీతి రత్నాకరము.pdf/46

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

45

గురువునానతి శిరసావహించువారు గాన వా రామాటలు వినినంతనే శ్రద్ధాళువులై యట్లే యొనరింతుమనిరి . ఆ నలువురిలో వేంకటేశ్వరుఁడు సాము చేసినవాడు, బలశాలి, ధీరుఁడు నగును. కాళీచరణదాసు బలశాలియగుటయే గాక యుపాయముల నెఱింగినవాఁడు. ప్రత్యుత్పన్నమతియనం జనును రామకిశోరశర్మ జన్మ ధార్ఢ్యము గలవాఁడు. కార్యము పట్ల ముందు వెనుక లాలోచించువాఁడు కాఁడు. అంతియ గాక ఖడ్గ చాలనమున రెండవ భీముఁడే యనవచ్చును. శ్యామ సుందరుఁడు పై వారి నొక్కొక విషయమున మించువాఁడే కాని సామాన్యుడు కాడు ఈనల్వు రిట్టివారు కాఁ బట్టియే గురువుగారు రహస్యముగ నీ కార్యము చక్కపెట్ట నియోగించెను. వారెల్లరు శుక్రవారము రాకకై వేచియుం డిరి. ఆనంతాచలశర్మ యుఁ దనయిష్ట దేవత నారాధించుచు రాధిక కించుకంతయుఁ గీడుకలుగకయుండునట్లు కరుణింపవలయు నని ప్రార్థించుచుండెను. తుహినకిరణ శేఖరుఁడు పొరపాటున నీమాట యేల జాఱవిడిచితినని విచారించుచు గురు వీమాట నాలకించినజాడ కానరాలేదే యని మరలఁ దృప్తినొందుచు నుండెను.


నాల్గవ వీచిక.

జాలంధరపురమున మహోత్సవము సాగుచుండెను. ఆది శక్తి కేటేట నాయుత్సవము సాగునాచారము కలదని పాఠకులు ముందే చదివియుందురు. లక్షలకొలఁది మానవు లరు