పుట:నీతి రత్నాకరము.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వీచిక

41

పాతాళునకుఁ గర్ణపిశాచికావిద్య తెలియును. దానినే చక్కగ నారాధించు వాడు. అది క్షుద్ర దేవతయే యైనను కొన్ని కొన్ని సమయములయందు విశేషించి యుపకరించును. తిరస్కరిణి యనువిద్య యతఁ డెఱుంగును. దానిచేఁ దానితరులకుఁ గనఁబడకయుండ నుండఁగలడు. అట్లుండుట కొలఁది ముహూర్తము లే యైనను జమత్కారముగ నుండుటయే గాక యల్పముగ సాయము కూడ నగును కదా. అట్టి కార్యముల వలన ముందు హానికల్గినను దత్కాలము మహోపకారముగ నావిద్య కనఁబడును. పెక్కుమూలికల నాతఁ డెఱుంగును, వీనియన్నింటిసాయమున నాఘన కార్యమును జేయఁబూనెనే కాని విధి వీనినన్నింటినీ మించి పనిచేయఁ గలదుగదా యను నూహ యాతనికి లేక యుండెను. దేవతలచే నీచ కార్యము చేయింపఁ బ్రయత్నించిన నవి యెదురెక్కి తన్నే మృతినొందఁ జేయునన్న విషయము నెఱుంగఁ జాలినంత జ్ఞానము కలవాఁడు కాఁడు. విశేషించి యైహికఫలములే ముక్తిఫలాధికము లను కొనునల్పుల కట్టివిశేషవిషయములు గోచరింప వనుట నిక్కము. నాలుగు దినములు కొఱఁతగా నాతఁ డనుకొన్న కాలము ముగిసెను. త్వరపడ వలసిన యవసర మేర్పడియెను. కుంతలాదులను హెచ్చరించెను. వారు చెప్పినట్లు చేయ సిద్ధముగా నుండిరి.

విలాసధామముననే యొక్క శ్రోత్రియ బ్రాహణుఁడు కలఁడు. అతని పేరు శంకరాభరణశర్మ. అనంతాచలశర్మ యనియు నాతనిఁ బిలుతురు . రెండవ పేరే ప్రసిద్ధమయ్యెను. ఆభూసురుఁడు దరిద్రుడు. కాని యయాచకుఁడు ప్రాప్తలాభ