పుట:నీతి రత్నాకరము.pdf/36

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ వీచిక

35

మాయావి, టక్కు, టమార, గోకర్ణ, గజకర్ణములు లోనగు విద్యలయం దాఱి తేఱిన మేటి. చూచుటకుఁ బరమసాధువుగ నే తోఁచును కానీ నిలువెల్ల విషమే. ఏమాట పల్కిన నందొక్క విషబిందువు లేకయుండదు. కావుననే యెల్ల వారు వానిమాట లను నమ్మకయుండిరి. క్షుద్రవిద్యలయందు నిరుపమాన పాండిత్యమును సంపాదించెను వానిచేఁ బామరు లాతని మాంత్రికుఁడని భ్రమపడి పిలుతురు. ఆభిచారికహోమములఁ జేయుచుండుట యాతనియలవాటులలో మొదటిది దానిచేఁ బెక్కం డ్రాతనికి భయంపడుచుందురు. కుంకుమ రేఖ యతని కనుబొమలనడుమ విరాజిల్లుచుండును. కుంతలుఁ డాతనిననుసరించి మాంత్రికుఁ డని పించుకొన్న వాఁడే. ఐనను బాతాళునిమాట జవదాటువాఁడు కాఁడు.

రాధికకు నించుక ప్రాయముకాఁగాఁ దనకా కన్యక నిమ్మని యిందిరాదేవికి వార్త పంపుచుండెను ఆమాటనే యామె చెవిఁ జొరనీయక యుండెను. చాలప ర్యాయము లా ప్రయత్నమును సాగించి యిఁక లాభము లేదని నిరాశుఁ డయ్యెను. కాని మనస్సున నాకన్యకను హరించికొని పోయి "పెండ్లియాడవలయునని నిశ్చయించుకొనియెను. దానికిఁ గావ లయుపరికరములను సిద్ధము చేయుచుండెను. భరతపురమును గ్రామ మావిలాస ధామమునకు మూఁడుక్రొశముల యంత దూరమునఁ గలదు. అది కుగ్రామమైనను భరతపురమను పేరును వహించెను. పూర్వమెప్పుడో నగరముగనే యుండెనఁట ఆగ్రామమునకుఁ దూర్పుదిశయం దొక దేవాలయము కలదు. అది ప్రాచీనమే కాని నవీనముగా నిర్మింపఁబడినది కాదు. దాని