పుట:నీతి రత్నాకరము.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

34

నీతి రత్నాకరము

మూఁడవ వీచిక.


ఒక్కరి గొప్పతనమున కసూయపడుచుండుట మానవ సామాన్య స్వభావము దుర్గుణములయందెల్ల నసూయ ముందుగఁ బరిగణింపఁబడును. దానివంటిది వేఱోకఁడు లేదని పెద్దలందురు. అది యొక్కఁడున్నదికదా యనరాదు. అన్ని దుర్గుణము లుండిన గాని యది నిలువఁజాలదు కాన నసూయ యుండిన నన్ని యవగుణము లుండినట్లే యూహింపవలయును. లోకమున నసూయయే పెక్కండ్ర, బాధించుచుండును. ఎందఱి గొప్ప తనమునకో యపకీర్తిని గల్గించుచుఁ దాను రాజ్యము చేయుచుండును. దాని జయించుటయే దిగ్విజయమనంబడును. దానిని జయింపక యెన్ని దేశముల జయించిన నది విజయము కానేకదు. ఆవిజయమునఁ దనకు సుంతయు మేలు లేదు. అసూయను జయించినవాఁడే భగవదను గ్రహమునకుఁ బాత్రుం డగును.

విలాస ధామమున నిరువురుమిత్రు లుండిరి. వారు శ్రీనివాసదాసు తెగకుఁ జేరినవారే. ఇందిరా దేవి పితృపక్షపువారు. వారు సోదరులు గారు. కాని వావింబట్టి సోదరులవంటివారే. ఒక్కని పేరు పాతాళుడు. రెండవవాని పేరు కుంతలుఁడు. పాతాళుఁడే యిందిరాదేవికి నించుక సమీపబంధువు. అనఁగా సోదరుఁడు, కుంతలుఁడు పాతాళునకు దూరపుసోదరుఁడు. వీరిద్ద ఱోక్కగురువుకడ నేమో మంత్రములు నేర్చుకొనిరి కావున సతీర్థ్యులు. కుంతలుఁడు స్వీయబుద్ధి ప్రభ లేనివాఁడు. పాతాళుఁడు