పుట:నీతి రత్నాకరము.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

32

నీతిరత్నాకరము

ఇఁకఁ గథకు మరలుదము. రాధికకు శ్రీకృష్ణ దాసునకుఁ: బరస్పరగుణ శ్రవణమూలమున ననురాగము పొడ మెనని యీవఱకే చదివితిమికదా. మనస్సులో నిమాట నించు కే వెలిపుచ్చక వా రుండిరి. పెద్దలయందు వారికిం గలవిశ్వాస మెట్టిదో చూచితిరికదా. అట్లుగాక వారిరువురు తల్లిదండ్రులమాట: దల పెట్టక స్వేచ్చగా లేఖల వ్రాసికొనియో దూతికామూలమున స్వాభిప్రాయములఁ దెలుపుకొనియో యొకానొకచో నిరువురును గలిసి కొని ప్రేమమును దృఢపఱచుకొనియో యిందునేది చేసియుండి నను వారిచరిత్రము మీవంటి పాఠకమహాశయులమది కెక్కియే యుండదు. స్వేచ్ఛా ప్రవర్తకులకుఁ బాఠ్యములగు గ్రంథముల యందు నది వెలయుచుండఁగలదు. అట్లు గాక సావిత్రీ సత్య సంతులవలె వా రిరువురును 'బెద్దలమాట వేదతుల్యమని భావించినకతన వారిచరిత్రము వనితల కెల్లరకు నుదాహరణభూతమయ్యెను. కొలదిదినము లిట్లు గడచెను.

ఇందిరా దేవియుఁ దనభర్త నుచిత రీతిఁ ద్వర పెట్టసాగెను. ఆజాతి వారి కామహారాష్ట్ర, దేశమునఁ బదునాలు గేఁడులు మించక యుండ వివాహము చేయుటాచారమఁట. ఆ నెపమున నాపురంధ్రీమణి ప్రాణనాథా ! రాధిక విదుషి యయ్యెను. పదునాల్గవవత్సరము వెడలుసమయము రానున్నది మనకులాచారమురీతి నింకను జరపుట పాడి గాదు కదా. కావునం బెద్దలయలవాటును దాఁటక వివాహ ప్రయత్నము చేయుటుచితమని నాకుం దోఁచెడిని. మీరేమి యూహించితిరో తెలియఁగోరియున్నాను. అని వినీతిఁ బల్కెను. శ్రీనివాసదాసు పత్నీ వాక్యములను విని చిఱునవ్వు నవ్వి నీ వడుగు