పుట:నీతి రత్నాకరము.pdf/26

ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ వీచిక

25

 కాదు. ఏశాస్త్రమున నేసందేహమునుగూర్చి ప్రశ్నించినను వెంటనే బదులువచ్చుటం జేసి సర్వశాస్త్రములు వచ్చునని తెలియఁదగుఁగదా, కృత్రిమబుద్దిని బ్రశ్నించినచో బదులే రాదు. దానింబట్టి యీతఁడు ప రేంగితావగాహి యగు బుద్ది గలవాఁడని తేటపడును. మఱియు దివ్యదృష్టిగలవాఁడనియు నూహింపఁ దగును నూత్న వయస్సు కాదుగాని నలువది యేండ్లకు మించియుండదని యాతని రూపము తెల్పును ఎవ్వరికీ నామహనీయమూర్తివలన బాధ కలుగదు. అడిగిన నన్నము పెట్టుదురేని భక్షించును. లేదన్న నూరకయుండును. మనుష్యులకూటమి నా యోగి యాశింపఁడు విజనస్థలముననే యా దాసుండును. ఎందఱో పరీక్షించిరి. కాని యొక్క దోషమైన నున్న యట్లారోపింప నేరక నోరుమూసికొని యూరకుండిరి. ఎవ్వరేని విశేషించి ప్రార్ధించిన సమాధానముగనున్న వచ్చును. ఎవ్వరింటి కాతcడరు దెంచునో వారికి మహత్తర శుభములు గలుగునన్న ప్రవాదమొక్కఁ డెల్ల తావుల వ్యాపించెను. సర్వదా రామనామమును బలుకుచుండువాఁడు. విశేషించి దేవీసమారాధకుఁడు. అట్టి వారికి దేవతలయందుఁ దారతమ్యము గలదనుభావ ముండదు ఎల్ల తావుల నొక్క పరమాత్మ నే వారు చూచుచుందురు. కావున నే దేవతయైనను వారికి సమానభ క్తిచేఁ బూజింపబడఁదగినదై యుండును.

ఆమహాత్ముడే యా యక్షరాభ్యాసముహూర్తమునకుఁ బిలువకపోయిన నరుదెంచెను. ముహూర్తము సమీపించు చున్నదని మౌహూర్తికులు తెలుపుచుండిరి. సర్వాలంకృత గాత్రుఁడై బాలకుడు కన్నులపండువు చేయుచు నాడుకొను