పుట:నీతి రత్నాకరము.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

20

నీతిరత్నాకరము

మెఱింగి పాడినఁగాని భుజంగములు తన్మయత్వము నొందవు. ఇపుడీ కాలాహి తన్మయత్వము నొందినది. పాట నిలుపఁగా యథాపూర్వరూపము గలదగును. రాధిక శాస్త్ర విహితపద్ధతిని మీఱక రాగము పాడినదని మన మెఱుంగవలయును. ఇది విషమపరీక్షయే యనక తప్పదు. అహితుండికుఁడు సమర్ధుడు. రాగ మెట్లు పాడినను బాధ లేకుండ నాఫణి నడంపఁ గలఁడు. ఆ విషయ మెఱింగియే యాతనిం బిలువఁ బంచితిమి. వయస్సున నామెకుఁ బదునాల్గవవత్సరము సాగుచున్నది. ఇంత స్వల్పకాలమున నింతటి పాండిత్యము సంగీతమునఁగల్గుట పూర్వ పుణ్యమే యనవలయును. ఉపదేశమాత్రమున సమ్యగ్ద్రహణ శక్తి యీ కుమారికకుఁ గలదు. కావున నీమహాసభలో బహుమానము పొంద నర్హురాలని మనవి చేయుచున్నాఁడను. నా యీభావము మీకెల్ల నంగీకారమయ్యెనేని ఆవిషయ మెఱుక పఱపుఁడని కూరుచుండెను. ఎల్ల రేక వాక్యముగ నంగీ కారమును దెలిపిరి.

తొలుదొలుతం బెద్ద లాశీర్వదించిరి. సువాసినులు మంగళములుగలుగఁ బాటలుపాడి సేసలు చల్లిరి. మహాజనా శీర్వాద మొక్కసారి సభాభవనము పిక్కటిల్లఁ జేసెను. అంతకుముందే యుపసంఘమువా రేకాంతముగఁ బరీక్షించి యుండిరి. ఆసభ్యులభావము ననుసరించి సిద్ధముచేయించిన సువర్ణపతక మొండు తేఁబడియెను. తాంబూలముపైన దాని నునిచి పరీక్షకులు మూవురు సభ్యులకుఁ బ్రతినిధులై యా రాధిక కొసంగి శారదాకరుణాపాత్రతం గాంచి చిరకాల మాయు ర్భాగ్యారోగ్యయశశ్శీలములు గలిగి వృద్ధినొందుమా