పుట:నీతి రత్నాకరము.pdf/2

ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు

సరసమనీషులారా! నీతిరత్నాకరమను నీయాఖ్యాయికను దమ కర్పింపగలిగితని ఇందు నీతిమార్గావలంబకులకు విజయము, తద్విరుద్దమార్గావలంబములను నపజయము గలుగుటయే ప్రధాన భాగము. ఈ విషయములు రెండు నిందు విస్పష్టములగు. విశేషించి భగవత్సహాయము, సాధువుల తోడ్పాటు నీతి మార్గమునకు గలదని యీయాఖ్యాయిక తెలుపును. స్త్రీ పురుషు లన్యోన్యనుగుణప్రేరితులై ప్రేమగలవార లైననే యది చిరకాలము నిలుచుననియు, వేఱొకమార్గమున నది యచిరకాలముననే క్షీణించు ననియు తెలుపుటకే యీచిన్ని పొత్తము వ్రాయబడిన దనియుఁ దేటపడును. జనుల యభిప్రాయము లెట్టులున్నను నీతిమార్గము సర్వపక్షసమాదరణీయమగును గదా. దాని నాశ్రయించఁబూనిన మార్గములు వేఱు వేఱుగా నుండును. ఏమార్గము తుదకు నీతిమార్గమునఁ దన్నాశ్రయించినవానిం జేర్చునో యదియే సన్మార్గ మనబడును అట్టిమార్గములఁ దెలుపు గ్రంథములే బాలురకు నుపకరినరించునవి.

ఇందు నా చేసిన కృషి విశేషించి వ్రాయదగినది కాదు. స్త్రీవిద్య యెట్టిది మంచి దనునది నాయెఱింగినంతవరకు నిందు దెలిపితిని. క్షుద్రమంత్రములు లోనగునవి తొలుదొలుత మేలు గలిగించిన ట్లగవపడినను దుదకు హానిఁ గల్గించునని యీ కథా