పుట:నీతి రత్నాకరము.pdf/14

ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి వీచిక . 13

వాసదాసు సంతోషించెను. ఆయన ధర్మపత్ని యిందిరాదేవి పరమానందభరితురా లయ్యెను. వృద్దవి ప్ర ప్రవరుఁడు తన యింటికిం బోయెను.

తరువాత నాదంపతు లాలోచించుకొని సుముహూర్తము నిశ్చయింపఁబడఁగా వ్రతమునకుఁ గడంగిరి. సద్బ్రాహ్మ ణుల రావించిరి. విత్తశాఠ్యము లేక ప్రతిమను 'జేయించిరి. యథో క్తముగా వ్రతము నాచరించిరి. ఇంచుక యేనియు గొఱంత గాంచక యావ్రతము పూర్తిచేయఁబడియెను. ఎల్లరా వ్రతమును దిలకించి తప్పక సంతానముకలుగునని విశ్వసించిరి. వారి భక్తిశ్రద్దలు చూచువారి కెంతయు నచ్చెరువు గలుగఁ జేసెను. ఇంచుకంతయు లోప మేవిషయమునందును గలుగక యుంచెను. కొలఁదిదినములు జరగ నాయిందిరా దేవి గర్బవతి యన్న సువార్త మెల్ల మెల్లన నలుదెసలకుం బ్రాంకెను. దాని విన్న వారెల్ల నానందాంభో రాశి నోలలాడిరి. గర్భ సంస్కారములగు పుంసవనాదులు చేయఁబడియె, నెలలునిండెను. ఒక్క నాఁ డాయిందిరా దేవి కలగాం చెను. అందొక్క సువాసిని సకలాభరణములం దాల్చి తాంబూలచర్వణము చేయుచు వచ్చి యొక్క చక్క నిఫల మిందిరాహస్తమున నిడ దీని ననుభవింపుమని పలికి యదృశ్యు రా లయ్యెను. ఆవల మేల్కాంచి సమీపతల్పమున శయనించియున్న ప్రాణనాథునిఁ బిలిచెను. అయ్యది నాలవజాము కావున నాతఁ డనుస్మృతిని బారాయణము చేయుచుండెను. భార్య పిలువఁగనే చెంతకుం బోయి కూరుచుండి యేల పిలిచితివని యడిగెను. ఇందిర స్వప్న