పుట:నీతి రత్నాకరము.pdf/13

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

భక్తిప్రీతులు గలదగును. అవి రెండును గుదిరినఁ గాని యారాధనము సఫలము కాదు. ఆని యాలోచించి యది లెస్సగా మదికి సరిపడినందున నవకాశము కలిగింపక మున్ను తన్నెఱింగిన వృద్ధభూసురవరేణ్యుని బిలువంబంచి యుచితసపర్యల జరపి యుదంత మెఱింగించెను, మహనీయుఁ డా ప్రశ్నమున కానందించి నీవాంఛితము ఫలించును. సత్యము. శ్రీఘ్రంబ సంతానగోపాలమూర్తిని బూజింపుము. ఆపధ్ధతి నాలకింపుము.

శుభముహూర్తమున విత్తశాఠ్య మొనరింపక రత్న సువర్ణ రజతాదులచే శ్రీకృష్ణు నాకృతిని స్థండిలమున నునుపసలయును. సకలవిధాలంకృతమండపము నమరించి తన్మధ్య కల్పిత స్థండిలమున నునిచిన శ్రీ సంతానగోపాలమూర్తిని బూజింప వలయును. ఆనాఁడు ప్రతియామమునను బూజ చేయవలయును. గోభూ ప్రభృతిదానములను యథాశక్తి నొనరింప వలయును. సాధువ్రతపరాయణులగు విప్ర ప్రవరులకు భోజనం బిడవలయు. దీనాంధక బధిర కుబ్జుల నన్న దానమున సంతృపులం చేయవలయు. ఆవలఁ దాను సభార్యుఁ డై భుజిుచి యా ప్రతిమను శుద్ద శ్రోత్రియునకు దానము చేయవలయును. ఈ భగవత్పూజ భక్తితో జేయవలయును. దంభాచారున కది ఫలము నీయదు. మనోవాక్కుల నేక రీతిగా భావ మల రారఁ బూజించిన నే ఫలము గలుగును. ఈ పూజ సాంగముగా నేఱవేఱిన సంతానము కలుగును. రాధామాధవులయం దెవ్వ రిపై నధికభక్తి, కలుగునో తదంశము గలసంతానము గలుగును. ఇది సత్యము. అని వ్రతవిధానమును దెలుప శ్రీని