పుట:నీతి రత్నాకరము.pdf/111

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

103 నీతిరత్నాకరము నము చేయఁ బ్రయత్నింతురో వారిని దమజాతినుండి వెడల నడువఁ దీర్మానము గావించిరి. వివాహాదులయందుఁ గలకట్టు బాటుల సడలింపరాదనియు వానివలనిలాభములు వాజ్ఞానస గోచరములు సామాన్యులకుఁ గావనియుఁ దప్పక యెంతో మేలు వానివలనఁ గలదనియు నతీంద్రియజ్ఞు లాశుభముల నెఱింగియే వాని నియమించిర నియు నట్టివాని నల్పజ్ఞులు సడలింపఁ బ్రయ త్నించిన వారిభావముల మన మంగీకరింప రాదనియు నెల్లరు తీర్మానించిరి.

ఆపిదప సాగవలసిన వివాహతంత్రములు సాగింగఁ బడియెను. సకాలమున ముహూర్తము జరపబడుటయుఁ బెద్ద లాశీర్వదించుటయుఁ జూచువాల కెంతో యామోదమును గలిగింపఁజా లెను. శ్రీనివాసదాసు వచ్చిన పెద్దల బహూకరించి చందన తాంబూలముల నొసంగి రామదాసు గారిని గృహప్రవే శము దనుక నుండి ఫోవలయునని ప్రార్థించి వారందుల కను మతింప నెల్లరను భోజనములు సేయ నాయాయి చోటులకు దయ చేయుఁడని ప్రార్థించెను. ఎల్లరు తమతమ విడుదులకుం బోయిరి, వధూవరుల కాపగలు భోజనము లేకుండుట యాచారము. అరుంధతీ దర్శనానంతరము భుజింప వలయునని పెద్దలయాశ యము. ఆ యాచారము ననుసరించి వారు ఫలాహారములం గైకొనియుండిరి.

వచ్చిన వా రెల్ల భుజించి సంతృప్తి మిగులం గాంచి యిం చుక విశ్రమించి సాయంసమయమునకు ముందే కార్య క్రమము 'నెఱింగిన వారు 'గానఁ 'బెండ్లి పందిరి కరుదెంచిరి అందాసమయమున నాట్యము సాగును. వారకాంతలు వచ్చి యల్ల రకు నమ