పుట:నీతి రత్నాకరము.pdf/110

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆజన వీచిక. రాదు, వారికిని దైవము తోడ్పడునని మనమించు కేఁ దలంప రాదు. వారికి భగవద్గీత లుపన్యాసముల కుపయోగించుననియే నిశ్చయింపవలయును. ఈ నాలుగుమాటలు మీకుఁ దెలుపు టనవసర మే యైనను వచ్చియున్నా ఁడఁ గానఁ జెప్పితిని మను జులసంసర్గమునే మాని యందందు నిర్ణనస్థలముల నివసించుచు భగవన్నా మసంకీర్తనము చేయుచునుండిన నేనీ కాలమునఁ బ్ర బలిన దురూహలననుసరించి ప్రాచీనసదాచారముల మానుడు రేమో యన్న సందియమున వచ్చి లోకమున కుదాహరణ భూతులగు నీసజ్జనుల ప్రయత్న మునకుఁ దోడ్పడ నరుదెంచి తిని. ప్రాజ్ఞులారా ! మీ రెఱుంగని విషయములు లేవు. మీరు చదువనిశాస్త్రములు లేవు. మీ రాచరింప నిధర్మములు లేవు. మీ రభ్యసింపని యోగములు లేవు. మీకుఁ దోఁపని యూహలు లేవు. ఐనను వాక్చావలమున నామనస్సునఁ గల యభి ప్రాయమును దాఁపక వెలిపుచ్చితిని. మీ రెల్లరు సమా హితచిత్తులరై , యాలకించితిరి. ఇక నేను మీయనుజ్ఞఁగైకొనఁ దలఁచుచున్నా ఁడను. తరణోపాయము దొరకక భగ వంతు నాశ్రయించినఁ దనంతన తానే దొరకునని నమ్మియున్నాఁ డను.

అని యుపన్యసించి రామదాసు కూరుచుండెను. ఆమహో' పన్యాసము నాలకించి గంభీరమగు తదగ్గమును గ్రహించి సామా న్యులుకూడఁ బరమానందభరితు లైరన నిఁకఁ బండితులమాట నిటఁ జెప్ప నేటికి ? వారు కూరుచుండఁగనే మీయభి ప్రాయము సత్యధర్మ విహితము. అని యేక వాక్యముగఁ దమ మనోభావ ములఁ దెల్ఫిరి మఱియు నెవ్వరెవ్వరు సనాతనసదాచాలనిర్మూల