పుట:నీతి రత్నాకరము.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

నీతిరత్నాకరము

________________

నీతిరత్నాకరము ఆనగరమున నొక ధనవంతుఁ డుండెను. అతని పేరు శ్రీని వాసదాసు. తలిదండ్రు లాతనికి వివాహమువఱకుఁ గలసంస్కారము లొనరించి గతించిరి. భాగ్యంగూడి శ్రీనివాసదాసు సద్వృత్తిఁ గాలముఁ బుచ్చుచుండెను. లక్ష్మీనారాయణులవ లే వారు లున్న వారని యెల్ల వారు వాడుచుండిరి. పరోపకారము వారికే నైజ గుణము. కాని ముఖస్తుతులను జేయు వారిని మాత్ర మాదా సాదరింప కుండెను దీనాంధబధి రాదు లాతనియిల్లు కల్ప వ్రుక్షమని కాచుకొని యుందురు. అన్న దానము వస్త్ర దానము ననునీ రెండు వాతఁ డెక్కుడు గాఁ జేయువాఁడు. తక్కినదానములు యధోచిత ముగా: జేయు చుండును. బంధువుల రాకకుఁ బరిమితి లేకుండెను. వ్యాపారమున ధన మెక్కువగా లభించుచుండుటనే

వ్యయము నాతనిమదికి లెక్కించగినది కాకయుండెను. ఆవ్యాపారము: న్యాయము నతిక్రమింపక చేయఁబడుచున్నందున దినదినానాభివృద్ధి నొందుచుండెను.

ధర్మంబు చెఱుపఁ జెఱచును,
ధర్మము రక్షించువారిఁ దా రక్షించున్.

అన్న సూక్తి యేల తప్పును ! ఆవ్యాసార మాతని కాలమున: నారంభింపబడినది కాదు.. కులవృత్తి. "కావున శాస్త్రీయ మే యన, వలయుఁగదా.

శ్లో. “స్వే స్వే కర్మణ్య భిరతస్సంసిద్ధిం లభతే నరః."

అను భగవద్గీతా వాక్యము ప్రమాణము కదా. ఆవ్యాపారమునే పాటించి కులవృత్తియని భగత్ప్రతిపాదితమని కర్తవ్య మ్మని యాతఁ డోనరించుచు దేహమంతయుఁ గన్నులుగా