పుట:నీతి రత్నాకరము.pdf/109

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

106 నీతిరత్నాకరము ప్రపంచవృద్ది హేతుభూతలు. కావున స్త్రీల మనస్సులు దుష్టములు కాకయుండఁ గాపాడవలయును. కులమును, జరిత్ర మును, దనను, సంతానమును, ధర్మమును గాపాడుకొనఁ దలఁచువాఁడు పరపురుషసంగతిఁ బోనీకయుండ భార్యను రక్షింపవలయును. లేనిచో నివి యన్ని యు దుష్టములవు. కావుననే పెద్దలు యోగదృష్టం బరికించి ధర్మములను యుగముల కనుకూలములుగా మార్చిరి. భగవంతునియందు భక్తి గలుగుమార్గముల సులభముగాఁ దెలిపిరి. వానినెల్ల నీనూతనా చారములు పాడుచేయును.

ఈవివాహము ప్రాచీన సదాచారము సనుసరించి చేయఁబడినది. వధూవరు లన్యోన్య ప్రీతి గలిగి మీ యమో ఘాశిషములమూలమునఁ బరమేశ్వరుకరుణకుం బాత్రులై దీర్ఘాయురారోగ్యములఁ గాంతురు గాక. సర్వేశ్వరునను గ్రహమున సనాతనధర్మము, తదనుగుణము లగునాచారములు నశిం పక యథాపూర్వముగా నుండుఁగాక. మీరందఱు మన్వాది సృతులయుఁ బురాణములయు, మహాభారతా దీతిహాసము లయు ధర్మములను వదలక యాచరించుచు, దురాత్ములయుప దేశముల, నుపన్యాసముల నాలకించి మోసపోవక వారు స్వేచ్ఛా ప్రవర్తకులని లోకమున గౌరవమునే కోరువారని, శాస్త్రములతత్త్వముల నెఱుంగనివారని కేవల యుక్తివాదు లని, ఆ స్తికులభంగిఁ దోచు నాస్తికులని నిశ్చయించి వారికి దూరముగాఁ దొలంగియుండవలయును. వారితో విశేషించి సంభాషింపరాదు. వారియుక్తుల విని యిందే మేని 'మేలుం డునా యని యాలోచింపరాదు. వారిం జేరి భాషింపఁ బూన