పుట:నీతి రత్నాకరము.pdf/107

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

101 నీతిరత్నాకరము జేసి యొక్క తావుననే నిలుచుననుట విశ్వసింపఁ దగనిమాట. వరునిచి త్తము నట్లే యని నిశ్చయింపవలసి యుండును.

ఇటీవలఁ గొందఱు కొంతలు పెండ్లియాడినపిదప నాతని వదలి వేఱోకనింగూడి చరించుచు నితరులను, దమమా ర్గము నుపదేశించుచు సభలకు, విలజ్జం బోవుచుఁ బురుషులని యనుమానింపక మాటలాడుచుఁ గరము వై దుష్యము నగ పఱచుచు వారి నవ్వించుచుఁ బ్రాచీనాచారములం దూలనా డుచుఁ బ్రవర్తించుచున్న వారని వినవ చ్చెడిని. అది కరము చింతాకరము! పరిశుద్దాంతరంగులకు మిగుల సంతాపకరము. పరపురుషునిం గూడితిరుగుట యెంతి మంచిదో నే: జెప్పనక్కఱ లేదు.*[1] వయసుక త్తియ వయసు కానిం గూడి తిరుగుట భారత భూమి నీవఱకు 'లేదనియు, నిప్పుడు కొత్త గా నచ్చినయా చాన మనియు, మీరు నేఱుంగుదురు. చంద్రమతి, దమయంతి, సీతాది సాధ్వీమణులు జన్మించిన యీపవిత్ర భూమియం దీయాచారము ప్రాంతది కాదని నేఁ జెప్పనేల? శాపాను గ్రహసామర్థ్యము వెలయ నీభూమిని బొడమిన స్త్రీ పురుషులు ప్రసిద్ధి గాంచిరి. మనశ్శుద్ధివినాశనం బగు నీయాచారము నవీనముగాఁ బొడ చూపుచున్నది. ఆమార్గము స్వేచ్ఛా ప్రవర్తకుల కత్యంతాను

  1. * ఒక్క నిఁ బెండ్లియాడి మఱియొక్కని సుందరకాయుఁ గూడి యే దిక్కు నఁజూడఁ దానయము తేటపడం దగుమాటలాడుచున్ మిక్కిలి నేర్పుకత్తెయన మించి చరించుచుచున్నఁ జూచి "పెక్ మక్కువ నాదరింతు రిది మంచిది గా దన 'రేమి కాలమా.”-కలివిలాసము.