పుట:నీతి రత్నాకరము.pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆజవ వీచిక. తోలఁగును. వానినే విశ్వసించి మానవు లుందురు. ఈయుదు హరణము మీయనుభవమునఁ దోఁచునదే కానీ క్రోత్తగా గల్పింపఁబడినది కాదు కదా. అట్లే తనయావజ్జీవము సహధర్మ చారిణి యని ప్రేమించినకన్యను వరుఁడు రూపమునే ప్రధాన ముగా భావించిన ననర్థము వాటిల్లును. గుణము ప్రధానముగా భావింపవలయుననియే సనాతనాచారము తెల్పెడిని. అట్లుగాక వివాహమునకంటె ముందే సహచరసల్లాపాదులచే నాకన్యకనుబరి చితం జేసికొని ప్రేమించి పిదప వివాహము చేసికొనిన నా ప్రేమ మస్థిరమగుటయే కాక యనర్థదాయక మగుటకు సంశయం బే లేదు. ఒక్కనినే ప్రేమింపవలయునన్న నియమ మపు డుండదు. 'పెక్క డ్రఁబ్రేమించి యందెవ్వనిపై నతిశయ వాంఛ కలుగునో యాతనిం గన్యక 'పెండ్లియాడు నేని యద్దానిమనస్సు త్వరగా మాఱిపోవు ననుట య చ్చెరువును గల్పింపఁజాలదు. కావున వధూవరు లిరు వురును సద్గుణలుబ్ధులు కావలయును. రూపపరీక్ష, తల్లిదండ్రు లది. ఈయాచారము ననుసరించినవివాహము వధూవరులకు సదా సంతోషదాయకంబే యగు. పరస్పర సహకారమును వారు విడువఁజాలరు.

ఈసనాతనాచారము హేయమని యూహించి యిష్ట మునకు నను వగుకన్యను బెండ్లియాడవలయునని యీ కాలపు వారు విరళముగ నందం దుపన్యసించుచున్నారు కదా. ఒక్క నినే ప్రేమించుట యీ నూతనాచారమున సంభవింపదు. ఎంద ఱినో పరీక్షించి యం దుత్తము నొక్కనిఁ బెండ్లియాడవలసి యుండును. అట్టి స్త్రీ చిత్తము పలుతావులఁ బ్రసరించినదగుటం