పుట:నీతి రత్నాకరము.pdf/105

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

102 నీతిరత్నాకరము వారి యమృతవాక్కుల వినఁ గుతూహలులై యుండువారు గాన నెల్లరు నిశ్శబ్దముగ నుండిరి. రామదాసిట్టు లుపన్యసించెను. నిర్మలాంతఃకరణ భూషితులారా ! పరోపకారపారీణులారా ! ఈమహోత్సవమును గుఱించి నాలుగుమాటలు చెప్పే దను చిత్తగింపుడు. కన్యాదానము చేయుపద్దతి యిది మీరు చూచితిరి గదా, సనాతనమగునది యీయాచారమే కన్య కను వివాహమునకన్న ముందు వరుఁడు కనుఁగొనరాదు. అతని తల్లిదండు, లే యామె కులశీలాదులఁ బరికింపవలయు. లోకమున భగవంతుఁడు తప్ప దక్కెనవారిలోఁ దలిదండ్రుల కంటె దనయుని మేలు కోరువారు లేరనుట నిర్వివాదాంశము. అట్టి తలిదండ్రులు పరికించి కులోద్దారకురాలు కాఁగలదని విశ్వసింప వలయు. ఆకన్యకను వరుఁడు వరింపవలయు. పాణి గ్రహణమున నొకవస్త్రము వరుసకుం గన్యకకునడుమఁ బట్టు కొనఁబడును. ఆవలఁ గన్యక తనకుఁ దగిన ట్లునుపఁబడిన పీఠ మునఁ గూరుచుండవలయు. పాణిగ్రహణము ననంతరము వస్త్రము తొలఁగింపఁబడును. అత్తరుణమునఁ దనయావజ్జీవ సుఖాకర యగుకన్యకను వరుఁడు చక్కఁగాఁ జూడవల యును. ఆవీక్షణమే పరస్పర ప్రీ తిరశ్ముల వారిని బంధించును. ఈసంబంధ మాజన్మ ము నిలుచునదియే కాని నడుమ విడి పోవునది 'కాదనుభావ మే వారికిం గల్గును. అట్టి ప్రీతి శాశ్వత ముగా నిలువక తప్పదు. ఒక్క రాజు పట్టాభిషిక్తుఁడు కాగా నాతనిపై మిగులఁ బ్రీతి యంతకుముందు లేకుయున్న నిఁక నీతఁడే మనకు ఱేఁడు. మన మీతనిరక్షణమున నుండక తప్పదు. అనుభావము దృఢపడఁగా ముందున్న యసూయ: