పుట:నీతి రత్నాకరము.pdf/104

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆఱవ వీచిక. జేసిరి, మంగళ ప్రదము లగు గాథలు గలమంత్రములను శ్లోక ములను బఠించిరి. బ్రాహణ ప్రవరు లాశీర్వదించిరి. కన్యాదానము యథావిధిగ సాగెను. ఆయవనిక తొలఁగింపఁబడియె. వరుఁడు కన్యాముఖమును జక్కఁగాఁ జూచెను. అదియే ప్రథమ వీక్షణము. కావున నాతని మదింగల ప్రీతి యొక తేజోరూపమున నాకన్య కాహృదయమును దృష్టి మార్గమునఁ బ్రవేశిం చెను. కన్యామణి ప్రమదము నట్లె వరునిహృదయమును వీక్షణ మార్గమునఁ బ్రవేశించెను. ఆ ప్రీతి శాశ్వతమగుఁగాక యని పెద్ద లాశీర్వదించిరి. జీలకఱ్ఱయు బెల్లము కలిపి ముద్దఁ జేసి వరుఁడు కన్యామూర్దమద్యమున నున చెను. అదియే లగ్న మనఁబడును. తలఁ బ్రాలుగ మనోజ్ఞ తమమౌక్తికములఁ జేకొని రాధిక మనోహరుఁడగు శ్రీకృష్ణ దాసుమూర్ధమునఁ బోసెను. ఆతఁడట్లే దోసిటం గైకొని వానిని రాధికామ స్తకమునఁ బోసెను. మంగళసూత్ర ధారణాదులు క్రమము తప్పక సాగింపఁ బడెను. తలఁ బ్రాలు పోసినపిదప మహాత్తుల యాశీర్వచనార్థము వధూవరుల వరుసఁగాఁ గూరుచుండఁ బెట్టిరి. నిర్మలాంతః కరణులగు భూసురపుంగవులు లోనగువారు దంపతుల కీయిరు వురకును శ్రీలలనా ప్రాణనాథుఁడు సర్వమంగళా ప్రాణేశుఁడు సరస్వతీమనోహరుడు శచీనాయకుఁడు తక్కుంగల దేవతోత్త ములు నిరంతర సుఖానుభవదీర్ఘాయుర్బాగ్యముల నొసంగుచు రక్షింతురు గాక యని ద్రవ్యాభిలాషమున: గాక ప్రీతిమై నాశీర్వదించిరి.

ఆతరుణమున నామహాసభ భూసురేం ద్రాది నిబిడమై యుండెను. రామదాసయోగీంద్రుఁడు లేచి నిలువంబడియేను.