పుట:నీతి రత్నాకరము.pdf/103

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

100 నీతిరత్నాకరము తెల్ల వాఱుజాముననే మేల్కాంచి తమతమ విధుల నిర్వర్తించి కొని వాద్యధ్వనులఁ జెవియొగ్గి యాలించుచు జనులా పెండ్లి వేడుకలఁ జూడఁ గోరుచుండిరి. కన్యాదాతలు నభ్యంగస్నాన మొనరించి విధులందీర్చి లగ్నమునకై వేచియుండిరి. వరునిజన కులు కృతాభ్యంగస్నానులై కులాచారముల నయ్యై తెఱం గుల నిర్వర్తించి ముహూర్తమునకై కని పెట్టియుండిరి. ఇందిరా దేవియు శ్రీనివాసదాసును రామదాసయోగివర్యుం బురస్కరించుకొని సువాసినీ బృందము తోడ నడువ విప్ర ప్రవరులు వేదపారాయణము చేయుచు రాగా శుభ వాద్యధ్వనులు దిక్కులఁ బ్రతిధ్వనులీయఁ జేరవచ్చి వరునిఁ గులోచితమర్యా దలం దాటక పూజించి వరజననీజనకులఁ 'బ్రార్థించి శీఘ్రంబ యరు దెంచి సుముహూర్తమున నా వాంఛఁ దీర్పవలయునని పలుక నమృత పుసోనల మించిన యా నిద్దంపుఁబలుకుల నాలకించి యింతింత యనరాని సంతసంబున శ్రీవత్సాంక దాసు భార్యా పుత్ర పరివృతుండై సపరివారముగాఁ గదలి చని నిజపురోహి తో క్తమార్గంబు ననుసరించి కూరుచుండెను.

పాణిగ్రహణమహోత్సవము.

శుభముహూర్తము సమీపించెనని పురోహితుఁడు వక్కాణించెను. శుభ నినాదములు చెలరేఁ గెను. కన్యావరుల యంతరమున నొక నూతనాంబరమును బట్టుకొని నిలుచుండిరి. రాధిక యంతకుముందే సకలాభరణభూషితయై మహా లక్ష్కిం బూజించుచుండెను. కావునఁ బురోహితుఁడు తల్లిదం ద్రులుఁ జని స్వస్తీవాచనపూర్వకంబుగాఁ బిలుచుకొని వచ్చి, పశ్చిమాభిముఖము గలుగున ట్లుచితషీఠమునఁ గూరుచుండఁ