పుట:నీతి రత్నాకరము.pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

నీతిరత్నాకరము దాసు సంకల్పించినందున యాచకులు గాక మూడు వేల సంఖ్యకు మించినవారే ప్రయాణము సాగించిరి. అందందు విడుదుల నేర్పఱుప బ్రయత్నించెనుగాని యంతకు ముందే శ్రీనివాసదాసు వాని నేర్పఱచియున్న వార్త వినఁబడినందున నూరకుండెను. వారి శుభాగమనమున నాదరింప నున్న వారి యడంకువ కచ్చెరువందు వారిసంఖ్య యంతయని వచింప రాక యుండెను. ఎందు నిలువఁబూనిన నందే తగిన చలువ పందిరు లుండెను. దిగిన వెంటనే యాతిథేయసత్కారము లాచరిం తురు. భోజునాదులు మిక్కిలి కొనియాడఁదగిన ట్లుండును. మరల బయనముసాగించుటకుముందే యుపాహరము లమర్పఁ బడును. ఘోటకములకుఁ గూడ సుఖకరమగు ఘాసాద్యాహా రము సిద్ధముగ నుండును, పరిచారకుల కొనరిం చుసత్కార మే విచిత్రముగ నుండును. ఇంకఁ బెండ్లి వారి విషయమునఁ బ్రశ్నింప నవసర మేమియుండును?

కతిపయ ప్రయాణములకు విలాసధామ సమీపమును జేరఁగల్గిరి, అందొక రమ్యస్థానము నిర్మింపఁబడియుండెను. అందే వరపూజ చేయవలసినట్లు శ్రీనివాసదాసుగారి యాశయము. పెండ్లివా రచ్చటికి రాఁగా మంగళ వాద్యములు చెల రేగెను. కొందఱిదియే వివాహమందిరమని భ్రమ మొందిరి. అదొక పటకుటీరము. కుటీరమనుశబ్దమునకు సాధారణముగాఁ జెప్పు చున్న యర్థమున కది లక్ష్యముగాక యతివిశాల మై యున్నతమై హర్ష్య బ్రాంతిని గలిగించుచుండెను. అద్దానిం జేర రాఁగా వాద్య నిస్వనములు శ్రుతిహితములై శుభసూచకమ్ములై యొక్కుమ్మడి 'చెలఁగెను. అంతలోఁ గొందఱు ముత్తైదువులు