పుట:నీతి రత్నాకరము.pdf/100

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆఱవ వీచిక, నిలుచుండి కోలాహలము గావింపకుండ దాని వెలుపల నున్న తాసనము లుండఁజేసెను, రక్షకభటు లందందు నిలుచుండి నిశ్శబ్దముగా నుండఁజేయుటకు నేర్పఱచెను. ఆపందిరి విచిత్ర ముగా నలంకరింపఁబడియెను. చూచినది చూడకుండఁ జూచు చుండినను మూఁడుదినములు పట్టునట్లు చిత్రము లందుండెను. దానియె త్తిరువది బాహువులు. రామాయణ భారత భాగవతాది సద్గంథములచరిత్రము లన్నియుఁ జిత్రములయందే కనఁబడు చుండెను. ఆశిల్పమహిమము గొనియాడఁదగి విశ్వకర్మ నిర్మిత మాయనఁ దోఁపఁజేయుచుండెను.

జాలంధరనగరావతంసమునకు సుముహూర్తమునకు నొక్క దినముముందే దయచేయవలయునని శ్రీవత్సాంకదాసు నకు శుభలేఖలనంపి పురోహితుని సపత్ని కునిగా నంపెను. వా రచ్చటఁ జేరఁగనే యుచితమర్యాదల నెఱపి గారవించి బంధువులను హితులను రావించి సభ చేయించి శుభ లేఖఁ జది వించి యాశీర్వదించిన వారియక్ష తలను గైకొని యాపురో హితులను విశ్లేషించి గారవించి శ్రీవత్సాంకదాసు వివాహ ప్రయాణమునకు సంసిద్ధుఁ డయ్యెను. బంధువులు మిత్రులు పురోహితులు పరిజనులు ప్రయాణమునకు సంసిద్ధులైరి. ఉచిత వాహన శకటశిబి కాదు. లాయత్తము చేయఁబడియెను. శుభ దినమున శ్రీనివాసదాసపురోహితులు మార్గదర్శకు లగుచుండ మహోత్సవముగాఁ దరలిరి చతురంగయానములు బహువిధ శృంగారములఁ గైసేయఁబడియె. వానింజూడ మూఁగినజనుల సంఖ్య వచింప నలవిగాక యుండెను. ఆవివాహమును జూడ గోరిక కలదని తెల్పిన వారినెల్లఁ దోడుకోనిపోవ శ్రీవత్సాంక