పుట:నీతి రత్నాకరము.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి వీచిక

11

సంచరించు చుండెను. కులవృత్తి భగవద్ద్రూపముగా దలంచుచు దాని ననుసరించినఁ గృతార్థునిం జేయు నని పెద్దలందురు.

శ్రీనివాసదాసునకు నాలుగుసంవత్సరముల దనుక సంతానము లేకుండెను. కళత్రము మనసున నించుకవిచారమూనుచుండెను. పతికి నెదురాడనోడునట్టి శీలముకలది. కావున బయలుపడనీయక యుండెను. ఎట్టులో యా భేదమును భర్త యెఱింగెను. సత్కళత్రము చింతదీర్చుట పతికి హితముగదా యని సన్మతి నాలోచించి యిట్లు తలపోయఁ జొచ్చెను. మానుషానంద మెల్లరకుఁ గావలసినవిదియే. దానిం గాంక్షించుట పొరపాటు గాదు. ధర్మ ప్రజావృధ్యర్థము కదా వివాహము చేసికొనుట. దీనికి బురాకృతపుణ్యము తోడు పడవలయు దానికి మానవ యత్నము కూడఁ గావలయును. దైవపరులు కొందఱు మానవ ప్రయత్న మేలయందురు. అది పాటింపఁదగినమాట యనవలయును. భగవంతుని సేవించుట ప్రధానము. బాన నిహపరములు గలవు. దాని మాన నీ రెండును జెడును. కాఁబట్టి యీశ్వరు నారాధించు టుచితము. ఆ యారాధనము కూడఁ దొలుదొలుత విశ్వాసమును బుట్టించు నదిగ సుండవలయుఁ గదా. లేనిచో స్త్రీలకు భక్తి కుదరదు. ధర్మార్థకామమోక్షములను పురుషార్థములు నాలుగు వాంఛింపదగినవే యని పురాణములు తెలుపుచున్నవి. కనుక నిపుడు శ్రీకృష్ణు నారాధించుట యెంతయుఁ దగియుండెడు. అందును సంతానగోపాలనామమున శ్రీకృష్ణు నారాధించుట సమంచితమగు.ఈ నామమును విన్న యంతనే నాకళత్రము