పుట:నారాయణీయము.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

అందూర్ద్వభాగమున చిక్కువోవ జక్కగా దువ్విన - యుంగరాలు దిరిగిన - నీలవర్ణమున నిగనిగలాడు కురుల కొండెసిగ, నవరత్నఖచిత కిరీటము, చక్కగాఁ జెక్కిన నెమిలిపింఛము, మందారమాలలు చుట్టిన జుట్టుముడి. బాలచంద్రునివంటి ఫాలము. అందు ధవళము స్నిగ్ధమునగు నిలువునామము, ఆహా ! ఏమి నీ సొగసు ! నా తండ్రీ కృష్ణా ! కరుణాసాగరతరంగమువంటి కన్బొమలతో, సుందరములై నీలములగు వక్ష్మములతో నలంకృతములై చిఱు నగవుచే మొగవిరిసిన చల్లని నీ కృపారసము జల్లు చూపుల నియ్యనాథునిమీఁద వెలయింపుము.”

ఆహా ! ఎంత సమ్మోహనమగు స్వరూపమో కదా యనిపింప వర్ణంచును. క్రమముగా నాసికను. శ్రవణములను, అరుణాధరమును, కౌస్తుభాలంకృత కంఠమ్మును, శ్రీవత్సమును, వనమాలను, వర్ణించి, వర్ణించి, షితాంబర, రశనాకింకిణుల నగ్గించి, యూరుజానుజంఘలను జిత్రముగా నుత్ప్రేక్షించి, పరమప్రార్థ్యములును ప్రాప్యములును నగు పాదాంబుజములను ఏ భాగములతో నిట్లు స్తుతించును.

"గురుమంజుశ్రుతుల౯ బదాగ్రభజనన్ గొండాడు మంజీరము౯
 బరమభ్రాంతినిమజ్జదానతజనప్రత్యుక్త ధీమందరో
 ద్ధరణ ప్రౌఢము కూర్మమూర్తి ప్రపదమ్మాతామ్రరోచిర్నఖ
 స్ఫురి తేందుప్రభ నాశ్రితార్తితమము౯ బో కార్చుకళ్యాణసం
 భరిత మ్మాకలిత మ్మొనర్తును భవత్పాదాంగుళీ సంతతి౯."

పరమేశ్వరుపాదసేవ యుత్తమోత్తమ మని మనోహరములగు ధ్వనులచే స్తుతించునట్టి వఁట మంజీరములు. భ్రమలో మునిగిపోయిన భక్తజనుల బుద్ధి యనుమందరగిరి నెత్తునట్టి కూర్మములే యఁట యాయన మీఁగాళ్లు. ఇఁక కాలి యంగుళులో ఎఱ్ఱనికాంతి గలిగిన నఖము లనెడు చంద్రులయొక్క వెన్నెలలచే భక్తుల యార్తియను చీఁకటులను బో కార్చి శుభము లొసఁగునవియఁట. ఎంతటి భావన! ఎంతటి భక్తి! ఏమి మధురమగు భావము! ఎంత సొగ సై న కల్పన!

ఈ రీతిగా నానంద బాష్పములతో, రోమాంచ కంచుకితాంగములతో 'డగ్గుత్తికతో భగవంతుని దివ్యసుందరాకారమును గానముచేసిచేసి యవశుఁడై నారాయణభట్టపాదుఁడు తుట్టతుది కోర్కిగా .