పుట:నారాయణీయము.pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26


విరహ కాలమున అంగారమయుఁడవు (అగ్నికణములవంటి వాఁడవు) అయి అనగా తాపకారివైనను, సంయోగమున శృంగారమయుండవౌచు ఆనాఁటి సంయోగమునందును (అంగారమయః) అంగారమయుఁడ వగుట చిత్రము అని విరోధము, దానికి అంగ + ఆరమయః. అంగ+ (ఓయి కృష్ణ !) ఆరమయః (ఆనంద పెట్టితివి) అని విరోధపరిహారము. ఇట విరహమున గోపికలకు తాపకారివైనను సంయోగమున శృంగారస్వరూపుఁడవై ఓయీ వారిని బరిపూర్ణముగా ఆనందింపఁ జేసితివని భావము. ఈ భావము సభంగశ్లేషయుక్తమగు విరోధాభాసాల కారమున నున్నది. అట్టి దానిని విడువవీలుగాదు, గ్రహింప ససాధ్యము. ఈ విరోధము పరిహరించుటకు దీక్షిత కవివరుడు 'సంగేప్యంగా రమయ స్తత్ర' యనంగా అని యనుకరణమున నా వాక్యము నిబంధించుట మిగుల ప్రౌఢ మనక తీఱదు, 'అనుకృతేస్తి వాక్యంతు' అనికదా శాస్త్రము—ఇది కవితాశక్తికి నికషము. అది యటుండ నిచ్చి మఱియొకగాథ నరయుదము, రాసక్రీడ – ఈ ఘట్టమున శృంగారరస భంగిమలేకాక, నాట్యభంగిమల కనువగు లయానుకూల చ్ఛందోభంగిమను స్వీకరించుట యెంతయు నౌచిత్యాధాయకముగా నున్నది. మూలమున నున్న వృత్తమే యనువాదమునను గ్రహించుట యెంతయు సముచితముగా నున్నది.

మొదటిపద్యమున శ్రీకృష్ణపరమాత్మయొక్క మధురశృంగార స్వరూపము వర్ణింపఁబడినది. కేశాదిపాదాంతవర్ణనము అది. వేనలి౯ నెమిలిపించియము, వీనుల మకరకుండలములు, (హృదయమున) సరసీజహారములు, అంగరాగమునఁ గల్గు సర్వాంగసౌరభము. (మొలను) కనక కాంచికాంచిత వికంపి పీతవసనము, (పాదముల) మణి మంజు నూపురములు వెలుఁగ కమలాలయాప్రాణవల్లభుఁడు దర్శన మిచ్చుచున్నాఁడు.

తరువాతి పద్యమున

"మండితోరుపరిమండలానఁ గుచమండనాకలిత కంచుళి౯
 గండలోలమణి కనుకుండలినిఁ గామినీ కలిత మండలి౯
 దండి నొక్కొకతె దండ. నొక్కఁడయి దాను మారమణ ! నిండిరే
 యెండఁ గాయ జరియించి నీవు నటియించినా వచట రాసము౯.

అని - కుచమండలమునఁ గంచుళీమాత్రమును దాల్చి, గండభాగముల మణి కుండలములు నటింప మండలాకారముగా నిల్చిన గోవకన్యల నడుమ నొక్కొ