పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/61

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2-3

నారసింహపురాణము. ఆ-2

145


క.

కరకందుకమున నొకసతి, సురవైరిన్ వైవఁబూనుసుళు గతఁడు హృదం
తరమునఁ గని లీలాపం, కరుహముఁ దొలఁగించి దాని కన్నులు గప్పెన్.

108


చ.

అలికులనీలవేణి విను మాపొదరింటికిఁ బోకు నీకుఁ గా
వలసినయేని యేమి కఱనా తరువాటమునందుఁ గ్రొవ్విరుల్
పెలుచన నీదుమోవిఁ గబళింపఁగఁ [1]బొంచెను గండుఁదుమ్మెదల్
దలఁపవు ముగ్ధ వంచు నొక తామరసాక్షి యదల్చె నెచ్చెలిన్.

109


క.

విరిసినకుంతలబంధము, మురిసిననీవియును హస్తములఁ బట్టి కృశో
దరియొకతె పసుపుఁబయ్యెద, గరువలి జడియింపఁ(?) గుంజగర్భము దూఱెన్.

110


తరల.

పదనుమీఱ రసాలపేశలపల్లవావళి ముక్కులం
జిదిమి కుత్తుకబంటి తద్రవసీధువుం గొని చొక్కున
క్కొదమకోయిలగుంపు కన్నులఁ [2]గోరగించెడుకెంపు సొం
పొదవెఁ బాంధులమీఁదికోపపుటు బ్బటంచు సతుల్ నగన్.

111


మత్తకోకిల.

తోర మౌ విరితేనెసంద్రపుఁదొట్టునం బడి యీఁదుచు
న్మారుసింగిణిమ్రోఁతలో యన మాటిమాటికి మ్రోయుచుం
దూర నెక్కి పరాగపంక్తులఁ ద్రొక్కి సౌరభ మానుచు
న్వారిజాక్షులచూపుచాయల వాలెఁ దుమ్మెద లమ్మహిన్.

112


సీ.

పల్లవపరిణాహపాదారవిందయుఁ గర్పూరరంభోరుకాండయుగయు
సుమరేణుసైకతసముదగ్రజఘనయు నవనవపున్నాగనాభితలయు
భ్రమరడింభకరోమరాజరాజితయును శ్రీఫలస్తనకుంభశీలితయును
వల్లీమతల్లికాప్రోల్లసద్బాహయుఁ గ్రముకకోమలకంబుకంఠయుతయు
మధురసాదరదళపుష్పమంజరీము, ఖియును మాయూరపింఛాగ్రకేశపాశ
శాలియును నైనవనరమాచపలనయన, మమతఁ బ్రహ్లాదు నాహ్లాదమగ్నుఁ జేసె.

113


చ.

అసురవరేణ్యుఁ గూడి హరిణాక్షులు వృక్షలతామతల్లికా
ప్రసవము లాహరింప ముఖపద్మము లించుక వాడుచూపెఁ బై
దుసికిలఁజొచ్చె ఘర్మభవతోయకణంబులు తొట్రుపాటునన్
విసవిసగాక మందగతి విభ్రమము ల్విలసిల్లె నత్తఱిన్.

114


క.

ఆకాశకృష్ణవక్షః, స్వీకృతకౌస్తుభమువోలె వెలుఁగులఱేఁ డు
ద్రేకించెఁ బట్టపగ లతి, లోకములై కిరణపంక్తులు పిసాళింపన్.

115
  1. బొంచిన
  2. కోరకింపెడు