పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 11


సీ.

బలితంపుఱెక్కమొక్కల మొక్కలపుగాడ్పు ప్రాఁతగుబ్బలుల నుఱ్ఱూతలూఁప
మురియించు నిరువంక ముఖరంధ్రములనుండి పొగలేనిమంటలు బుగులుకొనఁగ
గజగాత్రములసావిఁ గబళింపఁ దునుకలై బలునీటిమోపరిబలఁగ మగల
మెట్టియూఁదిన[1] నేలపట్టువిచ్చిన గాడినెరియల బలియింటినెలవు దోఁపఁ
దారకలు రాల గ్రహములు ధరణి వ్రాల, జలధి ఘోషింప దిక్కులు జలదరింప
హరుఁడు శరభావతారంబు నవధరించి, వేగ మానవహరిపురోవీథి నిలిచె.

157


వ.

ఇవ్విధంబున రుధిరోద్గారిముఖద్వయతిలకీకృతతృతీయలోచనద్వితయంబును
శాతచంచూపుటవిపాటితహరిదంతదంతికుంభకూటంబును బ్రహసితగ్రహర
మణకిరణధారాపరిణాహసితప్రహరణఘృణిద్విగుణీకృతవలయమణికిరణభుజా
దండంబును నఖండపక్షవిక్షేపప్రక్షుభితనభోభూమిభాగపాతాళగోళసంచారి
సంచయంబును దర్పితసర్పహారకర్పూరప్రకారకాంతిసంతానవర్ధితశరశరదభ్ర
విభ్రమంబును జతురచరణచంక్రమణసంచలితకులాచలనిచయంబును నపార
వీరావేశఘోరాటోపదీపితాంతరంగతరంగితక్రోధరసవికసనచకితజఠరస్థజగ
జ్జాలంబు నై యాభీలం బగు శరభాకారంబు తోరంపుబింకంబునం గొంకక
తనకట్టెదుటం జూపట్టుటయు నాకంబంపుంబుట్టు వాజగబెట్టి తనబెట్టిదంబు
వారించుటకు నై చేరిన మారవిరోధి మతకంపురూపుగా నెఱింగి కోపంబు
లోపలనే యడంచి గాంభీర్యగౌరవకాఠిన్యగర్వగర్భితవాక్యసందర్భంబున ని
ట్లనియె.

158


క.

నీయందము నీచందము, నాయందములోనియవియు నాళీకహిత
చ్ఛాయకు లోపడనితమం, బేయెడ నున్నది యెఱుంగవే వికృతఖగా.

159


సీ.

అర్ధపౌరుషము నీకనుషక్త మైనది యాలంబుమీఁదనె ట్లాసపుట్టెఁ
గరతలామలకమై కనుపట్టు శూలంబు భవవైద్యుఁ డనుకొంట పాటియగునె
తోలు గప్పియు నెట్లు తొడవనేర్చితి వుగ్రవారవాణము[2] వీరవర్ణితంబు
భంజళ్లఁ ద్రొక్కింపఁ బాండిత్య మున్నదే యిజంద్గవము విహీనజపము
పెంటబూడివపం డైనతొంటిమేను, విడిచి యొకపుల్లవై యేలవిఱ్ఱవీఁగె
దింత నిలు పోకుపోకు నీగంతు లెల్ల, మానిపించెద శరభసమాఖ్యతోడ.

160


క.

ప్రద్యోతనతేజంబున, విద్యుత్ప్రభ యడఁగినట్లు విక్రమమున నీ
యుద్యోగము వారించెద, నాద్యంత ముదగ్రవిగ్రహానలశిఖలన్.

161
  1. యూరిన
  2. వారవారణ - మూ