పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/101

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 3-4

నారసింహపురాణము ఆ - 4

239


లాపంబులు దీపింపఁ గోపాటోపంబున నంబరంబు ఘూర్ణిల్లం బెట్టు పలుకుచు
నరదంబులు ద్విరదంబులు హయంబులుం బదాతిచయంబులు నయుత
నియుత లక్ష దశలక్షకో ట్యర్బుద న్యర్బుదప్రముఖంబు లగుసంఖ్యావిశేషం
బుల నుల్లంఘించి [1]క్రేళ్లుమెలంగం గసిమసంగి సింగంబులు గిరిగుహాంగ
ణంబులనుండి వెడలువడువున స్వర్గంబు వినిర్గమింపం దొడంగి రప్పు డుత్పా
తంబు లనేకంబులు గనుపట్టె నట్టు లయినను నెట్టవియసి గట్టిమనంబుతో
నదితిపట్టి చూపట్టి జయంతుం బురరక్షణంబునకు నియమించి చనుదెంచు
సమయంబున.

35


ఇంద్రుఁడు ప్రహ్లాదునిపై యుద్ధమునకు వచ్చుట

క.

కనలుననో నైజగుణం, బుననో తనువందు నుష్ణము ఘనంబుగ న
య్యనలుం డేడికతత్తడిఁ, గొని దాఁటించుచు బలాంతకుని గని మ్రొక్కెన్.

36


చ.

వగరుపుతేజి నెక్కి యిరువంకలం గింకరకోటి బింకముల్
నగవులు నట్టహాసములు నల్లనిమేనుల నుబ్బుగబ్బునై
మొగివిడ కేగుదేర దివిముట్టిన పట్టిన పోటుముట్టుతోఁ
బొగరున నేగుదెంచె రవిపుత్రుఁడు గోత్రవిరోధి డాయఁగన్.

37


గీ.

ఆత్మతుల్యమూర్తి యగు రక్కసుని నెక్కి, ఘోరభంగి వాఁడికోఱ లెసఁగ
వివిధభూషణాస్త్రవిద్యోతితాంగుఁ డై, దానవుండు వేల్పుఱేనిఁ గదిసె.

38


శా.

యాదోభేదము లెన్నియేని కొలువ న్వ్యాలోలపాశప్రభా
ప్రాదుర్భావము కల్పవహ్ని సుషమన్ భాసిల్ల సక్రోపవా
హ్యాదీర్ఘక్రమణప్లుతంబుల మనం బానందముం బొంద మాం
సాదధ్వంసనకాంక్ష మై నడచెఁ బాశాంకుం డశంకోద్ధతిన్.

39


క.

గంధవహుండు [2]సుధాంథో, బంధురు నలరించెఁ జిత్రపర్యాయగతిన్
గంధాంధహరిణసైంధవ, ముం ధేయని పఱపి సైన్యముఖతిలకం బై.

40


గీ.

గరుడగంధర్వకిన్నరగణము సిద్ధ
సాధ్యరక్షోబబలంబు లసంఖ్యములుగ
హయము దాఁటించుచును గదాభయదబాహుఁ
డగుచు విత్తేశుఁ డనికి నై యంగవించె.

41


క.

ఈశానుఁ డేగుదెంచె శి, ఖాశీతమయూఖరేఖఁ గళలుబ్బఁగ బా
హాశూలప్రభ ప్రబల వృ, షేశనిశంకటవిహారహేలావశుఁ డై.

42
  1. కీళ్లు మెలంగ్గ
  2. సుధాంద్ధోబంద్ధూనలరించ్చె