పుట:నాగార్జున కొండ.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిల్పాలు

25


వెళ్ళాడు. ఇంద్రుడు అతనిని గౌరవించి అర్ధరాజ్యం ఇచ్చాడు. రాజ్యం చిరకాలం పాలించాక మాంధాతకి ఇంద్రుడిని చంపి అంత రాజ్యమూ తానే ఏలాలనే దుర్బుద్ధి కలిగింది. వెంటనే అత నికి హరాత్తుగా ముసలితనం వచ్చేసింది. కాని స్వర్గంలో ముసలి తనం ముదరడానికి వీలులేనందున అతడు కింద భూమిమీద పడి పోయాడు అనుచరులు అతనిని పట్టుకుని శయ్యమీద వుంచారు. తర్వాత మాంధాత భూమిమీదా, స్వర్గంలోనూ కూడా లభించే సుఖం శాశ్వతం కాదనీ, దానికోసం ఆశపడవద్దనీ లోకాన్ని హెచ్చరించి మరణించాడు.

(4) శిబిజాతకం : బోధిసత్వుడు. ఒకసారి శిబిచక్ర వర్తిగా జన్మించి గొప్ప దాత అని పేరు పొందాడు. ఒకప్పుడు ఒక గద్ద బారినించి తప్పించుకుని ఒక పావురం శిబిశరణు చొచ్చింది. గద్దరూపంలో వచ్చిన ఇంద్రుడు పావురానికి బదులుగా శిబిని ఎత్తుకు ఎత్తు తన మాంసం ఇయ్యమన్నాడు. శిబి తన మాంసం ఇచ్చి గౌరవం నిలుపుకున్నాడు.

(5) మహాపద్మజాతకం* : ఒకప్పుడు బోధిసత్వుడు మహాపద్ముడనే పేర కాశీరాజు కొడుకుగా అవతరించాడు. అతని తల్లి చనిపోగా తండ్రి మరియొక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఒకసారి రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఈ సమయంలో సవతితల్లి యువకుడైన మహాపద్ముడినిచూచి మోహించింది. మహాపద్ముడు ఆమెని తిరస్కరించాడు. దీనితో అతనిమీద పగబట్టి అతని సవతితల్లి రాజు యింటికి రాగానే మహాపద్ముడు తనని బలవంతం