పుట:నాగార్జున కొండ.pdf/20

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా గార్జున కొండ


ఆయా ఈ శాసనాలు ఇక్ష్వాకు రాజులలో రెండవవాడైన శ్రీవీర పురుషదత్తుడి యొక్క, మూడవవాడైన ఏహువుల చాంతమూలుడి యొక్క పరిపాలనాకాలంలో వేయబడినవి. వీటిలో రాజ్యసంవత్సరాలు, ఋతువులు, పక్షాలూ చెప్పబడతాయి కాని ఏ శకమూ పేర్కొనబడదు.

శాసనములనించి ఎన్నో చారిత్రకాంశాలు తెలుస్తాయి. మొదటి చాంతమూల మహారాజు అశ్వ మేధము, అగ్నిష్టోమము మెదలయిన యజ్ఞాలూ, గోహిరణ్యహలాది దానాలు చేశాడనీ, అతడు కుమారస్వామి భక్తుడనీ ఇందుమూలంగానే తెలుస్తుంది పురుషదత్తుడు శకరాజుల అల్లుడనీ, అతని కూతురు వనవాసి రాజు భార్య అనీ శాసనాలవల్లనే తెలుస్తుంది. అలాగే యీ శాస నాలు ఆనాటి బౌద్ధాన్ని గురించి వివరాలు తెలుపుతాయి. ఇచ్చట ఆపరమహావినశై లీయులు, బహుశృతీయులు, మహిశాసకులు అనే భిక్షు శాఖలవారూ, సింహళ ద్వీప భిక్షువులు నివసించేవారని శాసనాల మూలంగానే తెలుస్తుంది. అలాగే ఇక్కడి కట్టడాలని గురించి వివరాలు కూడా వాటివల్లనే తెలుస్తాయి ఈ శాసనాలు దొరికివుండకపోతే ఈలోయలో బుద్ధుడి ధాతువు మీద నిర్మిచ బడిన మహాచైత్యం వుండేదనీ, ఇక్కడి విహారాలు ఫలానా ఫలానా వ్యక్తులు కట్టించారనీ, నాగార్జునకొండకు శ్రీపర్వతుమ నే పేరుండేదనీ అనే వివరాలు మనకు తెలిసేవి కావు. ఈ విధంగా ఇక్కడ లభించిన శాసనాలు చరిత్రరచనకి చాలా ఉపకరిస్తాయి.