పుట:నాగార్జున కొండ.pdf/18

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

నాగార్జున కొండ


తీర్థం బాగా వర్ధిల్లింది. ఇక్ష్వాకు రాజవంశపు స్త్రీలు చాలామంది విహారాలనూ, మండపాలనూ కట్టించారు.

రుణుపురుషదత్తుడు : ఇక్ష్వాకు రాజులలో ఇతడు కడపటి వాడు. ఇతని పరిపాలన విగురించి వివరాలు ఏమీ తెలియవు. ఈ కాలంలో దక్షిణాన పల్లవులు విజృంభించారు. బహుశః వీరు సాతవాహన సామ్రాజ్యం దక్షిణసీమలో సామంతులుగా వుండి వుంటారు. ఈ పల్లవవంశీకుడయిన సింహవర్మ వనవాసి పాలకులైన ఆంధ్రభృత్యుల, రాజపుత్రికను పెళ్ళి చేసుకొని ఆరాజ్యానికి ఏలిక ఆయాడు. అక్కడ నించి విజృంభించి అతడు దక్షిణంగా కంచివరకూ పోయి, ఆనగరాన్ని పట్టుకొని దానిని తనకు రాజధానిగా చేసుకున్నాడు. ఆమీదట సింహవర్మ ఉత్త రంగా దండెత్తివచ్చి, ఇక్ష్వాకులనీ, వారి సామంతులనీ ఓడించి, వారి పరిపాలన అంతమొందించాడు. కృష్ణానదివరకూగల భూమిని అంతనీ జయించి, ధాన్యకటకంలో ఒక ప్రతినిధిని ఉంచి యీ మహారాజు యీ ప్రాంతాన్ని పరిపాలించసాగాడు. చరిత్ర ప్రసిద్ధమైన ఇక్ష్వాకు సామ్రాజ్యం ఈ విధంగా నశించిపోయింది.


1. PII 2 PL II 3. PI, III
4. PI IV 5. PI V