పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డిసెంబరు నెల సంచిక నుండి:....చదవండి.

మా వూరు (నవల) ...అగరం వసంత్‌

కొద్ది నెలలకు ముందే 'సొతంత్రకాల సదువులు పేరుతో ఒక రచన 'అమ్మనుడిలో వచ్చింది. మరలా ఇప్పుడు “మావురు పేరుతో అగరం వసంత్‌, హోసూరు తెలుగు బతుకును మన ముందు నిలబెట్టటోతున్నారు. ఆటా మాటా పాటా, కూతా, చేతిరాతా, బడీ గుడీ సాగుబడీ (సంస్కృతి), అన్నీ అంతా తెలుగుమయంగా ఉండిన హోసూరు తాపులో తెలుగుదివ్వె కాడిగట్టి మినుకుమినుకుమని రెప్పారుస్తూ ఉంది. ఈ మెలననంతా మనముందుకు తెస్తున్నాడు వసంత్‌. ఆ ఎలమినీ............ చదివి పట్టించుకాందాం రండి.


దాంతో మర్నాడు మరికొన్ని పుస్తకాలు పంపామని, మద్రాసు నుంచి తెలుగు బైబిల్‌ కోసం కూడా రాశామని ఆమె ఉత్తరంలో వివరిస్తూ, "నీకు వీలైనప్పుడు అక్షరాలు రాసివుండే రెండు పెన్నీల “చేతిరుమాళ్ళు " (moral pocket handkerchiets)పంపు. ముఖ్యంగా రాణిగారి బొమ్మలున్నవి పంపు. "అవి ఇక్కడివారికి బాగా నచ్చుతాయి” అని రాస్తుంది. రాజాగారి అఖిరుబికి తగిన చిత్రాలను ఆమె బహూకరిస్తే ఆయన చాలా సంతోషించినట్లు ఆ ఉత్తరంలో రాస్తుంది. మొత్తంమీద యాత్ర బాగా జరిగిందని, తాము క్షేమంగా యిల్లు చేరుకున్నా దీని వల్ల తమకు మంచే జరిగిందని ఆమె సంతోషించింది.

పాఠకులకు విన్నపం

“Letters from Madras” రచయిత్రి జూలియా చార్లోటి, తనపేరు లోకానికి తెలియకుండా అజ్ఞాతంగా ఉండి,“By a Lady" ” అనే మారుపేరుతో ప్రచురించింది. 1836-38 మధ్యకాలంలో ఆమెభర్త జేమ్సు థామస్‌ రాజమండ్రిలో జడ్జిగా పనిచేశాడు. జూలియాకు ప్రతివిషయం తెలుసుకోవాలనే అభిలాష తను కన్నవీ, విన్నవీ అన్నీ లేఖలరూపంలో ఇంగ్లండులోని తనవారికి తెలియజేసింది. ఆమె ఈ లేఖలను ఎవరికి రాసింది తెలియదు. ఉత్తరాలలో ప్రస్తావనకువచ్చే వ్యక్తుల పేర్లన్నీ ఆమె మరుగుపరచింది.

ఈలేఖల్లో ఆనాటి ఆంధ్రదేశ ప్రజలజీవితం, ఆచారవ్యవహారాలు, విద్యావిధానం, కోర్టులు, న్యాయవాదులు, కోర్టులో సివిల్‌ క్రిమినల్‌ దావాలు ప్రయాణాలు, కంపెనీ ఉద్యోగుల విలాసవంతమైన జీవితం ఇట్లా అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఆమె తిరిగిన ప్రదేశాలను, చూసిన వ్యక్తులను కళ్ళకు కట్టినట్లు వర్ణించింది. వలస పాలకుల చూపుతో,స్త్రీదృక్సథంనుంచి అన్నిటినీ గమనించింది.

జడ్జి దంపతులను కలుసుకోడానికి విద్యావంతులైన వ్యక్తులు వచ్చినపుడు వారిని ఆమె హిందూమత విషయాలను అడిగి సందేహాలు తీర్చుకొనేది. వారికి కైస్తవ్రమత గ్రంథాలు ఇచ్చి చదవమని ప్రోత్సహించేది. ఆ దంపతులకు మిషనరీ కార్యక్రమాలమీద మక్కువ ఎక్కువ.

మంచి సంగీతం వింటున్న సమయంలో మధ్యలో ఉన్నట్లుండి పాట ఆగిపోయినట్లు జూలియా చంటిబిడ్డకు ఆరోగ్యం బాగలేక పోవడంతో వైద్యుల సలహామేరకు, 1839లో ఇద్దరుబిద్ణలతో ఆమె ఇంగ్లండు వెళ్ళిపోతుంది. ఆమెభర్త థామస్‌ 1840లో అనారోగ్యంతో చనీపోయిన తర్వాత మూడేళ్ళకు ఆమె మెయిట్లాండ్ అనే మతప్రచారకుణ్ణి పెళ్ళి చేసుకొని తనపేరును జూలియా మెయిట్లాండ్ గా మార్చుకుంది.

నామిత్రులు, సీనియర్‌ పత్రికా రచయిత స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ మూడు దశాబ్టాలక్రితం ఈలేఖలను తన సౌంతమాటల్లో వివరిస్తూ ముఖ్యమైన విషయాలు “ఆమెలేఖలు” పేరుతో అనువదించారు. ఆతర్వాత దాన్ని అనేక పర్యాయాలు తిరగరాసి, మెరుగులుదిద్ది అచ్చుకు సిద్దంచేస్తున్న సమయంలో అనారోగ్యంతో చనిపోయారు. గోపాలకృష్ణ1986 ప్రాంతాల్లో తను తెలుగు చేసిన 24 ఉత్తరాల రఫ్‌ గ్రాఫ్ట్‌ ఫొటొ కాపి నన్ను చదివి అభిప్రాయం తెలియజేయమని పంపించారు. ఈ ప్రతిలో కొన్ని అంశాలు తగ్గించి అమ్మనుడిలో ప్రచురించడానికి పంపించాను. అమ్మనుడి సంపాదకులు ఇప్పటికి 14 లేఖలు ధారావాహికగా ప్రచురించారు.

చాలామంది పాఠకులు ఫోన్‌ చేసి పుస్తకం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అసక్తిని గమనించిన తరువాత “ఆమె లేఖలు”ను పుస్తక రూపంలో తీసుకుని రావాలని తలపెట్టాను. ఆ విషయాన్ని “అమ్మనుడి” పత్రిక ద్వారా పాఠకులకు విన్నవించుకొంటున్నా త్వరలో పుస్తకం వెలుగు చూడగలదని ఆశిస్తాను. అమ్మనుడి అందించిన సహకారానికి సర్వదా కృతజ్ఞుణ్జి. -డా॥ కాళిదాసు పురుషోత్తం, నెల్లూరు


| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020 |

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

50