పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఒడిలో గుడికట్టుకాన్న చరిత్రను ఒడిసి పట్టుకొన్నాను.

ఒకనాటి మేటి శాసనపరిశోధకులు శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ గారినీ తలచుకున్నాను. నాయకురాలిదిగా పిలువబడుతున్న అపురూపాలయం, చంనమల్లికార్డునాలయమనీ, దాడిపోచుంగారి శాసనంలోని మల్లికార్జున నాయకుడు, ఎవరోకాదు, కాయస్థ అంబదేవుని కుట్రలు కుతంత్రాలకు బలై, రుద్రమదేవితో పాటు యుద్ధభూమిలో మరణించిన ఆమె అంగరక్షకుడని తెలుసుకున్నాను. క్రీ.శ 12వ శతాబ్టినాటి నాయకురాలు నాగమ్మ దేవాలయం కళ్యాణీ చాళుక్య వాస్తుశైలిలో అత్యంత శిల్చకళావిన్వాసంతో పల్నాటి నాపరాతితో నిర్మించబడింది. శిఖరం పడిపోయింది. కలశం కనుమరుగైంది. ప్రజలతో, ప్రభుత్వంతో పనిలేకుండా చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు ప్రహారీ గోడలా ఆలయాన్ని కాపాడుతున్నాా పక్కనున్న పదో శతాబ్ది బైరవ విగ్రహం నిర్లక్ష్యానికి నిరసనగా ఢమరుకాన్ని మోగిస్తూనే ఉంది. ఆరుగంటలపాటు అణువణువూ అన్వేషించి అలసిపోయిన నన్ను ఆకలి, ఈలోకంలోకి తెచ్చింది. దాచేపల్లి అడ్డరోడ్డులో సుబ్బమ్మ హోటల్లో భోంచేస్తూ, వరంగల్‌ మట్టెవాడలో టిట్టిభశెట్టి, మంచన శర్మలు ఇంపుగా కడుపునింపుకొన్న పూటకూళ్లమ్మను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకున్నాను. కర్తవ్యం గుర్తుకొచ్చి, కారెక్కాను తెలియకుండానే, తంగెడ చేరుకొన్నాను.

2009వ సంత్సరంలో శ్రీకృష్ణదేవరాయలి 500వ పట్టాభి షేకోత్సవాల సందర్భంగా, నేను, మిత్రులు కె.జితేంద్రబాబు, డి.సూర్యకుమార్‌ కలసి శ్రీకృష్ణదేవరాయల తెలుగు శాసనాలు” అన్న పుస్తకాన్ని తెచ్చాం. తూర్పు దిగ్విజయ యాత్ర సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలం, చిన్నఅహొబిలం, కాంచీపురం మొదలైన శాసనాల్లో తాను జయించిన కోటల్లో తంగెడ కోటను గురించి ప్రస్తావించిన సంగతి, క్రీశ 1515 జూలై 25, బుధవారం నాటి శ్రీకృష్ణదేవరాయలి శ్రీశైలం శాసనంలో శ్రీ వీరప్రతాప శ్రీకృష్ణదేవమహారాయలు విజయనగరాన నుండి పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి, ఉదయగిరి దుర్గం సాధించి, తిరుమల కాతరాయ మహాపాత్రుని పట్టుకుని, అద్దంకి, వినుకొండా, బెల్లంకొండ, నాగార్జునునికొండ, తంగెడ, కేతవరం, మొదలైన గిరి దుర్దా స్థల దుర్గాలు ఏకధాటిన గైకొని అని పేర్కొన్న విషయం మదిలో మెదిలాయి.

కృష్ణరాయలు వశమైన తంగెడ కోట గోడను చూడగానే ఐదొందలేళ్ల నాటి సంఘటన కళ్లముందు కదలాడింది.నిజానికి శ్రీకృష్ణదేవరాయలు తంగెడకొచ్చి, కోటను స్వాధీనం చేసుకోలేదు. ఈ మూరు రాయగండడు, తూర్పు దిగ్విజయ యాత్రలో ఉదయగిరి నుంచి బెల్లంకొండ దాకా గల గిరి, స్ధల దుర్గాల్ని జయించిన పరాక్రమవంతుడని విన్న తంగెడ దుర్గాధిపతి కృష్ణరాయనికి లొంగిపోయి, స్థలదుర్దాన్ని ఆయన వశం చేశాడు. కాలి నడకన కోట చివరిదాకా వెళ్లాను. కృష్ణానది కనిపించింది. తెలంగాణాకు కొత్తగా నిర్మించిన వంతెన కనిపించింది. మళ్ళీ కృష్ణ ఒడ్డు నుంచి వ్యాపించిన గుండ్రటి రాతి కోట ఐదు అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు, నాలుగు దిక్కులా ప్రవేశద్వారాలు, దక్షిణ ద్వారానికి ముందు నాలుగు కాళ్ల మండపం, సాక్షిదుర్దాలయం, చుట్టూ లోతైన కందకం. లోనికి ప్రవేశించగానే వేణుగోపాల, వీరేశ్వర, వీరభద్ర, గంటల రామలింగేశ్వరాలయాలూ, ఒక దిగుడు బావి, అనేక శాసనాలూ తంగెడ చరిత్రకు అద్దంపడుతున్నాయి. చరిత్రపై అసక్తిగల ఒక కుర్రాడి మోటారు సైకిల్‌పై మళ్లీ కోటగోడ చుట్టూ, లోపలా, చుట్టొచ్చి దక్షిణద్వారం దగ్గర టీ తాగి శాసనాలమీదే ధ్యాస, కొత్త విషయం మీద ఆశతో అన్వేషణకు బయలుదేరాం.

గంటల రామలింగస్వామి ఆలయంలో క్రీ.శ 1308 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని శాసనంలో తంగెడ గవర్నరు దేవరి నాయని సమక్షంలో అక్కడి 18 సమయాల వారు, ఉభయ నానాదేశ పెక్కండ్రనే వర్తకులు, తమ అమ్మకాల్లో కొంత లాభాన్ని గంటల రామనాథ దేవరకు సమర్పించినట్లుంది. వేణుగోపాల దేవాలయం ముందున్న క్రీ.శ. 1373 నాటి కొండవీటి ప్రభువు అనవేమారెడ్డి శాసనంలో అవుభళనాధుని దేవులెంక, గోపినాధ దేవుని చుట్టూ మండపం కట్టించి, 12మంది అళ్వార్లను ప్రతిష్టించి, కొంత భూమిని దానం చేసినట్లూ,కుమార గిరిరెడ్డిగారు రాజ్యం చేయుచుండగా(బహుశా యువరాజుగా) తంగెడ పాలకులైన చొక్క్మన సింగన, వాడపల్లి ఎక్కటీలు (సైనికులు), ఇంకా తంగెడ సైనికులు, ఆలయానికి చేసిన

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

39