పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“దీని బదులు నేరుగా ఇంగ్లీషులోనే వ్రాయడం నయం” అనిపిస్తుంది. ఇక తెలుగెందుకు ? “తెలుగు పదాలు అవసరం లేదు” అనే వాదన ఇంకా ముందుకెళ్ళి “అసలు తెలుగే అవసరం లేదు" అనే వాదనకి దారితీస్తుంది. ఇప్పుడు జఱుగుతున్నది అదే.

7. ఈత అన్నాక నీళ్ళలోకి దూకి నేర్చుకోవలసిందే. భాష సర్వాంగసుందరంగా అభివృద్ధి చెందాకనే అందులో సాాంకేతికాంశాలు రాస్తానంటే కుదఱదు. ముందు రాస్తూ రాస్తూ, ఆ క్రమంలో కొత్త పదాల్ని కనిపెడుతూ వాడుకలోకి తెస్తూంటేనే భాష అభివృద్ధి చెందుతుంది. సాహిత్యభాష సాంకేతిక భాషగా పరిణామం చెందుతుంది. ఇంగ్లీషు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

మఱో కోణం : తెలుగులో పదాలు లేవనే వాదన

“తెలుగులో పదాలు లేవు. లేదా తెలుగులోకి అనువదించలేం” ఇది సరైన అభిప్రాయమా ? లేక “మనకు తెలుగు భాషలో సరైన శిక్షణ లేదు, ఇంగ్లీషులో ఉన్నంత “ఇది సరైనదా ? ఇంగ్లీషు భాషలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇంగ్లీషు పదాలన్నీ ఆ భాష పుట్టినప్పటి నుంచే అందులో ఉన్నాయా? మధ్యలో ఆ పదజాలాన్ని పెంచడానికి ఆంగ్ల మేధావులు చేసిన మానవ ప్రయత్నమేమీ లేదా? ఆ పదాలు హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడ్డాయా ?

మనకి తెలుగులో ఉన్న పూర్వశిక్షణ మనచేత ఈ భాష గొప్పదనాన్ని ప్రశంసింపజేయదానికి సరిపోవడం లేదు. కొత్త తెలుగుపదాల్ని కల్పించడానికి చాలడం లేదు. ఇంగ్లీషుని అనువదించను సహాయపడలేకపోతోంది. మనకి పాఠశాలల్లో తెలుగు నేర్పుతున్న విధానం- మనం పదో తరగతిలో భాషాపరంగా ఏ స్థాయిలో ఉన్నామొ అ స్థాయిలోనే జీవితాంతం మనల్ని ఉంచుతోంది. తెలుగు పాఠ్యాల బొధనలో ఏ విధమైన కొత్త పద్దతులూ చోటుచేసుకోవడం లేదు. ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎలాంటి పాఠ్యాలూ పాఠ్యక్రమమూ, బోధనా పద్ధతీ, మూల్యాంకన విధానమూ ఉండేవో సరిగ్గా వాటినే ఏ మార్పూ లేకుందా కొనసాగిస్తున్నారు. తతిమ్మా అన్ని సబ్లెక్టులలోనూ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. అథవా, తెలుగు సబ్జెక్టులో ఏమైనా మార్పులు తెచ్చినా అవి ఈ భాషని నాశనం చేసే దిశలో ఉంటున్నాయి తప్ప బాగుచేసే దిశలో ఉండట్లేదు. మనం ఈ భాషాపరమైన స్తబ్దత (linguistic stagnation) కి అలవాటుపడి “ఓహో తెలుగంటే ఇదే, ఇంకేమీ లే"దనుకుంటున్నాం. తెలుగు సాహిత్య పఠనం పేరుతో మనం అనంతర జీవితదశాకాలంలో చదివేదంతా వ్యావహారికం, లేకపోతే పచ్చివ్యావహారికం.

ఒకపక్క ఇలా తెలుగులో స్తబ్దం (stagnate) అయిపోయిన మనం మఱోపక్క మన ఆంగ్లపరిజ్ఞానాన్నీ మాత్రం రోజు రోజుకూ పెంచుకుంటున్నాం, ప్రయత్నపూర్వకంగా! మన బహుభాషా పరిజ్ఞానం మన భాషనీ ఉద్ధరించడాని క్కాక దాన్ని కించపఱచడానికి దుర్వినియోగమవుతోంది. కొన్ని కొన్ని ప్రారంభిక తభావతులు చోటు చేసుకున్నప్పటికీ 'ప్రయోగశీలతని సాదరంగా ఆహ్వానించాల్సి ఉంది. ప్రయోగాలు చేస్తూ చేస్తూ పోగా వాటిల్లోంచి కొంత మంచి పుట్టే అవకాశం ఉంది. ఒక కొత్త ప్రయోగం నచ్చకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచించే స్వేచ్చ మనకెప్పుడూ ఉంది. అసలు ప్రయోగాలే చేయొద్దనఢం సరైన ధోరణి కాదు.

జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ (constant learning process). కొత్త పదాలు సృష్టి అవుతున్నకొద్దీ వాటిని మన పదజాల పరిజ్ఞానంలో భాగంగా చేసుకోక తప్పుదు. అది తెలుగైనా, ఇంగ్లీప్తెనా! అయితే ఇక్కడ ఆచరణాలో జఱుగుతున్నది ఏంటంటే-ఆ అభ్యసన ప్రక్రియలో ఇంగ్లీషు ఉండొచ్చుగానీ తెలుగు ఉండకూడదు అని వాదించడం. తెలుగు మాత్రం స్తబ్దం అవ్వాలి, ఎందుకంటే మనం స్తబ్దం అయ్యాం కనుక !

ఇహపోతే అర్ధం కావడం. ఏ పదానికీ స్వతహాగా సహ్యణ స్ఫోరకత(spot understandability) లేదు, తెలుసుకుని, పలికి, అలవాటు పడితే తప్ప! వాడుతూ ఉంటే అంతా వ్యావహారికమే. వాడకపోతే అన్నీ గ్రాంధికమే. మాతృభాష కానటువంటి ఇంగ్లీషులో ఏ కొత్తపదం వచ్చినా ఆబగా అందిపుచ్చుకోవదానికి సిద్దంగా ఉన్న మనం తెలుగు దగ్గణికొచ్చేసరికి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది తెలుగు తప్పా? మన తప్పా? ఆలోచించాల్సి ఉంది. ఏ కారణాన్నో ఇక్కడ చాలా ప్రతిఘటన (resistence) ఉన్నది, కొత్త పదాల్ని కల్పించుకోవడం పట్ల, వాటిని వాడడం పట్ల ! ఇంగ్లీషు పదాల్ని ఉన్నదున్నట్లు దిగుమతి చేసుకోవడాన్ని అభ్యుదయంగా భ్రమించే వాతావరణం ఉంది.

అదాన అనువాదాల పట్ల అపోహలు

ఆంగ్ల పదాల ద్వారా వ్యక్తమయ్యే భావాన్ని తెలుగుపదాలతోఅనువదించి వాడుతూంటే “మక్కికి మక్కి అని, “True translation” అని పేర్లు పెట్టి వెక్కిరించడం కనిపిస్తోంది. ఈ వెక్కిరింపులకి పాల్చడుతున్నది తెలుగువారే, ఇతరులు కారు. ఆ విధంగా తెలుగులో నూతనవద నిష్పాదకుల్నీ పద ప్రయోక్తల్నీ మానసికంగా క్రుంగదీయాలనే ప్రయత్నమూ, నిరుత్సాహపరచాలనే వ్యూాహమూ, అలా తెలుగుపై ఇంగ్లీషు పదాల బాహుళ్యాన్ని శాశ్వతంగా వ్యవస్థాపించాలనే అకాంక్షా వెల్లడవుతున్నాయి. అనువాదాల రూపంలోనైనా సరే తెలుగు బతికి బట్టగట్టడం వారికి ఇష్టం లేదు.

ఇలా అవహేళనలకి దిగేవారి. ఉద్దేశంలో - “ఆ తెలుగు ప్రత్యామ్నాయాలు ఒరిజినల్‌ కావు. అవి నకీలీ. కాబట్టి వెకిలి. ఒరిజినల్‌ ఇంగ్లీష్‌ ఐడియాస్‌ ని ఇలా అనువాదాల రూపంలో దొంగిలించి ఆ ఐడియాస్‌ కి మూలపురుషులైన ఇంగ్లీషువారి గొప్పదనాన్ని తెలుగువారు తెలుసుకోకుండా చేసి కప్పిపుచ్చదమూ, అవేవో తెలుగువారి ఒరిజినల్‌ ఐడియాస్‌ అయినట్లు ప్రచారమైపోవడమూ ఘోర అన్వాయం, అక్రమం. దురాగతం. తెలుగు తెలివితక్కువ, వెనకబడ్డవాళ్ళ భాష. ఇందులో తెలివైన వ్యక్తీకరణలెలా ఉంటాయి? మా లెక్క ప్రకారం ఉండకూడదు. తెలివైన, నాగరికమైన వ్యక్తీకరణ ఏదైనా ఉంటే దానికి ఇంగ్లీషు ముద్ర ఉండాలి. అదే ఆధునికత.అదే అభివృద్ధి. అదే గౌరవనీయత. అదే విజ్ఞానానికీ, నాగరికతకీ, అభ్యుదయ దృక్పథానికి అసలైన చిహ్నం. మేము సాక్షాత్తూ ఒరిజినల్‌ ఇంగ్లీషే తెలిసినవాళ్ళం. ఈ నకిలీ (తెలుగు) పదాలతో మాకేం పని?”

గ్రహించగలిగితే, ఇంతుంది ఈ ఎగతాళ్ళ వెనక !

అయితే, ఓ విషయం. ఇలా అనుకుంటున్నది, ఇంగ్లీషు అఱకొఱగా నేర్చుకుని తలలెగరేస్తున్న ఒక వర్గం మాత్రమే. ఇంగ్లీషు తెలియని అంధులు అనువాద పదాల్ని సాదరణంగా ఆహ్వానిస్తున్నారు. ఆంగ్లపదాల బదులు అవే వాడుతున్నారు. ఎందుకంటే వారివణకూ వాటికి (తెలుగుపదాలకి) ప్రత్యామ్నాయం లేదు.

కానీ ఆంగ్ల విద్యావంతులైన ఆంధ్రులవఱకూ ప్రత్యామ్నాయం

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

31